ఈ సారైనా ఓటరు థియేటర్లలోకి వస్తాడా?
మంచు విష్ణు నటించిన సినిమా ఓటర్. ఇది ఇప్పటి సినిమా కాదు. చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా. కానీ వివాదాలు, ఆర్థిక పరమైన కారణాల వల్ల ఈ సినిమా ల్యాబ్ లోనే మూలుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా టైమ్ లోనే ఆచారి అమెరికా యాత్ర సినిమా స్టార్ట్ చేసి, దాన్ని రిలీజ్ కూడా చేశాడు మంచు విష్ణు. అలా చాన్నాళ్లుగా మూలనపడిన ఓటర్ సినిమాకు మోక్షం లభించినట్టుంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని వివాదాలు […]

మంచు విష్ణు నటించిన సినిమా ఓటర్. ఇది ఇప్పటి సినిమా కాదు. చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా. కానీ వివాదాలు, ఆర్థిక పరమైన కారణాల వల్ల ఈ సినిమా ల్యాబ్ లోనే మూలుగుతోంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా టైమ్ లోనే ఆచారి అమెరికా యాత్ర సినిమా స్టార్ట్ చేసి, దాన్ని రిలీజ్ కూడా చేశాడు మంచు విష్ణు.
అలా చాన్నాళ్లుగా మూలనపడిన ఓటర్ సినిమాకు మోక్షం లభించినట్టుంది. ఈ సినిమాకు సంబంధించి అన్ని వివాదాలు పరిష్కారమయ్యాయని అంటున్నాడు నిర్మాత సుధీర్ పూదోట. ఈ సినిమాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, కచ్చితంగా జూన్ లో థియేటర్లలోకి వస్తున్నామని ప్రకటించాడు.
అంతా బాగానే ఉంది కానీ, ఇంత ఆలస్యంగా వస్తున్నప్పుడు డేట్ తో వస్తే బాగుండేది. జస్ట్ జూన్ లో రిలీజ్ అని మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కనీసం వచ్చే నెలలోనైనా ఈ సినిమా థియేటర్లలోకి రావాలని కోరుకుందాం. మంచు విష్ణు సరసన సురభి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కార్తీక్ దర్శకత్వం వహించాడు.