Telugu Global
NEWS

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా స్టీఫెన్‌ రవీంద్ర?

వైఎస్ జగన్ తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా తెలంగాణ స్ట్రిక్ట్ అధికారి నియామకమవుతున్నారు. కర్తవ్య నిర్వహణలో అత్యంత సమర్థుడిగా స్టీఫెన్ కు పేరుంది. వరంగల్, రాయలసీమలో పనిచేసినప్పుడు మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల పనిపట్టారు. అంతేకాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెన్నంటి ఉండే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా స్టీఫెన్ రవీంద్రనే ఉన్నారు. అంతేకాదు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఈయనకు పేరుంది. అందుకే జగన్ ఏరికోరి ఈ ఐపీఎస్ ఆఫీసర్ […]

ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా స్టీఫెన్‌ రవీంద్ర?
X

వైఎస్ జగన్ తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా తెలంగాణ స్ట్రిక్ట్ అధికారి నియామకమవుతున్నారు. కర్తవ్య నిర్వహణలో అత్యంత సమర్థుడిగా స్టీఫెన్ కు పేరుంది.

వరంగల్, రాయలసీమలో పనిచేసినప్పుడు మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టుల పనిపట్టారు. అంతేకాదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వెన్నంటి ఉండే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా స్టీఫెన్ రవీంద్రనే ఉన్నారు.

అంతేకాదు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా ఈయనకు పేరుంది.

అందుకే జగన్ ఏరికోరి ఈ ఐపీఎస్ ఆఫీసర్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరగా.. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో కేసీఆర్ వెంటనే ఒప్పేసుకున్నారట.

దీంతో తెలంగాణలో సర్వీసులో ఉన్న స్టీఫెన్‌ రవీంద్రని ఏపీకి మార్చాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం స్టీఫెన్ ను రిలీవ్ చేయడానికి మరో 15 రోజులు పట్టే లా కనపడుతోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై కేంద్రానికి లేఖ రాసిన తర్వాత కేంద్రం ట్రాన్స్ ఫర్ చేస్తుంది. ఆ తర్వాత ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ హైదరాబాద్ ఐజీగా పనిచేస్తున్నారు. ఏపీ ప్రజల ఆధార్ డేటాను కాజేసీ టీడీపీకి అందజేసిన వివాదాస్పద ఐటీ గ్రిడ్ కేసుపై ఏర్పాటు చేసిన సిట్ కు చీఫ్ గా ఉన్నారు. ఈయనను జగన్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించేందుకు నిర్ణయించారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా ఉన్న పోలీస్ అధికారులు కీలక స్థానాల్లో ఉన్నారు. వీళ్ళు చంద్రబాబు ప్రోద్బలంతో వైసీపీ అభిమానులు, నాయకులు, ఎమ్మెల్యేలను ముప్పుతిప్పలు పెట్టారు. స్వయంగా వైఎస్ జగన్ సైతం తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని చెప్పడం సంచలనంగా మారింది.

అందుకే స్టిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా పేరున్న స్టీఫెన్ రవీంద్ర ను ఏపీకి రప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు, ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏకంగా తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ ను నియమించేందుకు రంగం సిద్ధమైంది.

First Published:  27 May 2019 6:41 AM IST
Next Story