సీత మూవీ మొదటి వారాంతం వసూళ్లు
తను తీసిందే ఆణిముత్యం అనే రేంజ్ లో ఫీల్ అవుతుంటాడు తేజ. సీత సినిమాను కూడా అలానే తీశాడు. ఇదొక మోడ్రన్ రామాయణం అనేంత బిల్డప్ ఇచ్చాడు. కానీ మొదటి రోజే తేలిపోయింది సీత. వీకెండ్ నాటికి సినిమా ఫ్లాప్ వెంచర్ అనే విషయం తేలిపోయింది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలైన ఈ 3 రోజుల్లో 4 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 3 రోజుల్లో 4 కోట్లు అంటే సినిమా దాదాపు […]
తను తీసిందే ఆణిముత్యం అనే రేంజ్ లో ఫీల్ అవుతుంటాడు తేజ. సీత సినిమాను కూడా అలానే తీశాడు. ఇదొక మోడ్రన్ రామాయణం అనేంత బిల్డప్ ఇచ్చాడు. కానీ మొదటి రోజే తేలిపోయింది సీత. వీకెండ్ నాటికి సినిమా ఫ్లాప్ వెంచర్ అనే విషయం తేలిపోయింది.
నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలైన ఈ 3 రోజుల్లో 4 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 3 రోజుల్లో 4 కోట్లు అంటే సినిమా దాదాపు డిజాస్టర్ అని అర్థం. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఈ సినిమాను 16 కోట్ల రూపాయలకు అమ్మారు. 3 రోజుల్లో 4 కోట్లు అంటే ఇక బ్రేక్-ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యం. మొదటి రోజు ఈ సినిమాకు కోటి 80లక్షల రూపాయలు రాగా.. రెండోరోజు కోటి 20 లక్షలు.. మూడో రోజు కోటి రూపాయలు వసూళ్లు వచ్చాయి.
గమ్మత్తయిన విషయం ఏంటంటే.. రెగ్యులర్ గా బెల్లంకొండ సినిమాలు చూసే ఆడియన్స్ కూడా సీతను పట్టించుకోవడం మానేశారు. ఇందులో బెల్లంకొండ మార్క్ యాక్షన్, డాన్స్, ఫైట్స్ లేవని తెలిసిన వెంటనే సినిమాను దూరంపెట్టారు.