ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగేళ్ల తర్వాత ఫెదరర్ తొలిగెలుపు
తొలిరౌండ్ గట్టెక్కిన ప్రపంచ మాజీ నంబర్ వన్ తొలిరౌండ్లోనే ఏంజెలికో కెర్బర్ కు షాక్ ప్రపంచ మాజీనంబర్ వన్ రోజర్ ఫెదరర్…ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో నాలుగేళ్ల విరామం తర్వాత తొలి విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లోనే మాజీ నంబర్ వన్ ఏంజెలికో కెర్బర్ పోటీ ముగిసింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్ పోటీలు మిశ్రమఫలితాలతో ప్రారంభమయ్యాయి. సరికొత్తగా నిర్మించిన రోలాండ్ గారోస్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో మిశ్రమఫలితాలు […]
- తొలిరౌండ్ గట్టెక్కిన ప్రపంచ మాజీ నంబర్ వన్
- తొలిరౌండ్లోనే ఏంజెలికో కెర్బర్ కు షాక్
ప్రపంచ మాజీనంబర్ వన్ రోజర్ ఫెదరర్…ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ లో నాలుగేళ్ల విరామం తర్వాత తొలి విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లోనే మాజీ నంబర్ వన్ ఏంజెలికో కెర్బర్ పోటీ ముగిసింది.
2019 ఫ్రెంచ్ ఓపెన్ తొలిరౌండ్ పోటీలు మిశ్రమఫలితాలతో ప్రారంభమయ్యాయి. సరికొత్తగా నిర్మించిన రోలాండ్ గారోస్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈ టోర్నీ పురుషుల, మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో మిశ్రమఫలితాలు నమోదయ్యాయి.
పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో మాజీ నంబర్ వన్, గ్రాండ్ స్లామ్ కింగ్ రోజర్ ఫెదరర్…. గంటా 41 నిముషాల పోరులో…. ఇటలీ ఆటగాడు లోరెంజో సోనేగోను వరుస సెట్లలో అధిగమించాడు.
ఫెదరర్ 6-2, 6-4, 6-4 తో తొలిరౌండ్ విజయం నమోదు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్లో నాలుగేళ్ల విరామం తర్వాత ఫెదరర్ సాధించిన తొలిగెలుపు ఇదే కావటం విశేషం.
అంతేకాదు…గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో తొలిరౌండ్ విజయం సాధించడం 37 సంవత్సరాల ఫెదరర్ కు ఇది 60వసారి కావడం మరో రికార్డుగా నిలిచిపోతుంది. రెండోరౌండ్లో జర్మన్ లక్కీ లూజర్ ఆస్కార్ ఓట్టేతో ఫెదరర్ తలపడతాడు.
తొలిరౌండ్లోనే కెర్బర్ ప్యాకప్…
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ తొలిరౌండ్లోనే అతిపెద్ద సంచలనం నమోదయ్యింది. జర్మన్ డైనమైట్, 5వ సీడ్ ఏంజెలికో కెర్బర్ తొలిరౌండ్లోనే అన్యూహ్యపరాజయం చవిచూసింది. ప్రపంచ 81వ ర్యాంకర్, 18 ఏళ్ల అనస్తాసియా పటపోవా 6-4, 6-2తో కెర్బర్ ను కంగు తినిపించింది.
ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ లో జోకోవిచ్, మహిళల సింగిల్స్ లో నవోమీ టాప్ సీడ్లుగా పోటీకి దిగుతుంటే…రెండో సీడ్ రాఫెల్ నడాల్, మూడో సీడ్ సిమోనా హాలెప్ డిఫెండింగ్ చాంపియన్లుగా టైటిల్ నిలుపుకోడానికి సిద్ధమయ్యారు. రెండువారాలపాటు సాగే ఈ టోర్నీ ఫైనల్స్ జూన్ 9న పారిస్ లో ముగియనుంది.