రాజీనామాలకు శ్రీకారం
ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. చంద్రబాబు ఓటమి పాలయ్యాడు. వైఎస్ జగన్ కొత్త ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాజీనామా చేసింది. చంద్రబాబుతో పాటు మంత్రులందరూ మాజీలయ్యారు. అయితే సాధారణంగా ప్రభుత్వం నామినేట్ చేసిన వివిధ పదువుల్లోని వ్యక్తులందరూ ఇలాంటి సందర్భంలో రాజీనామాలు చేస్తారు. కొత్త ప్రభుత్వం తమకు కావాల్సిన వాళ్ళను నియమించుకునే విధంగా వాళ్ళు వైదొలుగుతారు. సున్నిత మనస్కులు, సంస్కారులు తమకు పాత ప్రభుత్వం కట్టబెట్టిన పదవులకు కొత్త ప్రభుత్వం రాగానే రాజీనామా చేస్తారు. […]
ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోంది. చంద్రబాబు ఓటమి పాలయ్యాడు. వైఎస్ జగన్ కొత్త ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాజీనామా చేసింది.
చంద్రబాబుతో పాటు మంత్రులందరూ మాజీలయ్యారు. అయితే సాధారణంగా ప్రభుత్వం నామినేట్ చేసిన వివిధ పదువుల్లోని వ్యక్తులందరూ ఇలాంటి సందర్భంలో రాజీనామాలు చేస్తారు.
కొత్త ప్రభుత్వం తమకు కావాల్సిన వాళ్ళను నియమించుకునే విధంగా వాళ్ళు వైదొలుగుతారు. సున్నిత మనస్కులు, సంస్కారులు తమకు పాత ప్రభుత్వం కట్టబెట్టిన పదవులకు కొత్త ప్రభుత్వం రాగానే రాజీనామా చేస్తారు.
ఆ బాటలోనే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ కే రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామా చేశాడు. జగన్ గెలుపొందగానే…. చంద్రబాబు తనకు ఇచ్చిన ఆ పోస్టు నుంచి గౌరవంగా వైదొలిగాడు. 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఇక ఇలాంటి నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళంతా రాజీనామాల బాట పట్టే అవకాశం ఉంది.