Telugu Global
National

జగన్ ను కలిశాక మోడీ సర్‌ప్రైజ్

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన అప్పులు తీర్చాలని.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మోడీకి జగన్ విన్నవించారు. ఇక ప్రధాని ఈ భేటి అనంతరం ట్విట్టర్ లో తెలుగులో స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సాధ్యమైనంత సహకారం అందిస్తామని తెలిపారు. జగన్ కు తన అండ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. Had […]

జగన్ ను కలిశాక మోడీ సర్‌ప్రైజ్
X

ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి సంబంధించిన అప్పులు తీర్చాలని.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మోడీకి జగన్ విన్నవించారు.

ఇక ప్రధాని ఈ భేటి అనంతరం ట్విట్టర్ లో తెలుగులో స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సాధ్యమైనంత సహకారం అందిస్తామని తెలిపారు. జగన్ కు తన అండ ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

సుమారు గంటకు పైగా ప్రధానితో సమావేశమైన జగన్ ప్రత్యేకించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను వివరించినట్లుగా తెలుస్తోంది. లోటు బడ్జెట్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం.. విభజన చట్టంలోని అంశాలను వైఎస్ జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించారు. ఈ విషయాలను సంబంధించి ఒక నోట్ ను అందజేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధానిని జగన్ కోరారు.

దీనిపై మోడీ కూడా ట్విట్టర్ లో స్పందించారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా ఐఐటీ వంటి కొన్ని జాతీయ స్థాయి విద్యాసంస్థలను రాష్ట్రానికి మంజూరు చేశామన్నారు. పోలవరానికి నిధులను కూడా విడుదల చేసినట్లు చెప్పారు. వివిధ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సహకరిస్తామని అన్నారు.

First Published:  26 May 2019 10:21 AM IST
Next Story