ప్రోటెం స్పీకర్ ఎవరు? జోరుగా చర్చ..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నరసింహన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ సీఈవో ద్వివేది గవర్నర్‌ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల లిస్టు అందజేస్తారు. ఆ తర్వాత అధికారికంగా జగన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. ఇక ఈ నెల 30 విజయవాడలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అయితే కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే […]
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నరసింహన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ సీఈవో ద్వివేది గవర్నర్‌ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల లిస్టు అందజేస్తారు. ఆ తర్వాత అధికారికంగా జగన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు.
ఇక ఈ నెల 30 విజయవాడలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అయితే కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే ముందే ప్రోటెం స్పీకర్ ఎంపిక ఉంటుంది. ఆయనే కొత్త శాసనసభను సమావేశ పరిచి.. సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది.
కాగా, సాధారణంగా సీనియర్ ఎమ్మెల్యేను ప్రోటెం స్పీకర్‌గా ఎన్నుకుంటారు. ఇటీవల ముగిసిన తెలంగాణ ఎన్నికల తర్వాత సీనియర్ ఎమ్మెల్యే అయిన ముంతాజ్ ఖాన్ (ఎంఐఎం పార్టీ)ను నియమించారు. ఇప్పుడు అలా సీనియార్టీ జాబితా తీసుకుంటే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే చంద్రబాబు మాత్రమే.
అయితే ప్రతిపక్ష నేత కాబోతున్న చంద్రబాబు నాయుడిని ప్రోటెం స్పీకర్‌ని చేస్తారా? లేదంటే మరో సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరాంకు ఆ బాధ్యత అప్పగిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
1983లో తప్ప చంద్రబాబు 1979 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక కరణం బలరాం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా గెలిచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, శిల్పా చక్రపాణి రెడ్డి పేర్లుకూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరు ప్రోటెం స్పీకర్ అవుతారో చూడాలి.