పయ్యావుల సెంటిమెంట్ మాత్రం పోలేదు !
ఏపీలో జగన్ సునామీ ముందు ఏ సెంటిమెంట్ నిలవలేదు. దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు కొట్టుకుపోయాయి. కానీ ఒకే ఒక్క సెంటిమెంట్ మాత్రం నిలిచింది. అదే ఉరవకొండ సెంటిమెంట్ . పిఠాపురంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదనేది కొందరి నమ్మకం. కానీ ఈసారి పిఠాపురంలో వైసీపీ గెలిచింది. దీంతో ఆ సెంటిమెంట్ పక్కకుపోయింది. గుడివాడలో కొడాలి నాని గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందనేది ఆ నియోజకవర్గ వాసుల నమ్మకం. 2004,2009లో టీడీపీ నుంచి నాని గెలిచారు. కానీ […]
ఏపీలో జగన్ సునామీ ముందు ఏ సెంటిమెంట్ నిలవలేదు. దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు కొట్టుకుపోయాయి. కానీ ఒకే ఒక్క సెంటిమెంట్ మాత్రం నిలిచింది. అదే ఉరవకొండ సెంటిమెంట్ .
పిఠాపురంలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదనేది కొందరి నమ్మకం. కానీ ఈసారి పిఠాపురంలో వైసీపీ గెలిచింది. దీంతో ఆ సెంటిమెంట్ పక్కకుపోయింది.
గుడివాడలో కొడాలి నాని గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందనేది ఆ నియోజకవర్గ వాసుల నమ్మకం. 2004,2009లో టీడీపీ నుంచి నాని గెలిచారు. కానీ ఆతర్వాత 2014లో వైసీపీ తరపున గెలిచారు. మూడు సార్లు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ నాల్గో సారి గెలిచి అధికార పక్షంలో ఉన్నారు. ఈ సెంటిమెంట్ తుడిచిపెట్టుకుపోయింది.
ఇక రోజా ఐరన్‌లెగ్ అని అన్నారు. ఈ సారి ఆమె ఓడిపోతోంది. పార్టీ అధికారంలోకి వస్తుందని కొందరు నమ్మబలికారు. కానీ ఆమె గెలిచింది. పార్టీ గెలిచింది. అధికారంలోకి వచ్చింది.
గంటా ఏ పార్టీలో గెలిస్తే..ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని కొందరు చెప్పేవారు. కానీ కష్టంగా గంటా గెలిచారు. కానీ ఆయన గెలిచిన పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు.
అయితే అనంతపురం ఉరవకొండ సెంటిమెంట్ మాత్రం పోలేదు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే..ఆ పార్టీ అధికారంలోకి రాదనేది ఇక్కడి వాసుల నమ్మకం. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. ఆ పార్టీ గద్దెనెక్కలేదు.
తాజాగా పయ్యావుల కేశవ్ ఇక్కడి నుంచి గెలిచారు. ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. మరోవైపు 2004,2009లో పయ్యావుల గెలిచారు. టీడీపీ అధికారంలోకి రాలేదు. మొత్తానికి ఉరవకొండ సెంటిమెంట్ మాత్రం అలాగే నిలిచిపోయింది.