Telugu Global
NEWS

విరాట్ కెప్టెన్సీ సత్తాకు ప్రపంచకప్ పరీక్ష

వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ కొహ్లీ వన్డేల్లో 41 సెంచరీల టీమిండియా కెప్టెన్  2008లో విరాట్ కెప్టెన్సీలో జూనియర్ ప్రపంచకప్  2019 ప్రపంచకప్ వైపు కెప్టెన్ గా కొహ్లీ చూపు వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…అరుదైన రికార్డుల కోసం తహతహలాడుతున్నాడు. 2008 జూనియర్ ప్రపంచకప్ లో భారత్ కు ట్రోఫీ అందించిన కొహ్లీ…2019 వన్డే ప్రపంచకప్ ను సైతం…కెప్టెన్ గా అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు. […]

విరాట్ కెప్టెన్సీ సత్తాకు ప్రపంచకప్ పరీక్ష
X
  • వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ కొహ్లీ
  • వన్డేల్లో 41 సెంచరీల టీమిండియా కెప్టెన్
  • 2008లో విరాట్ కెప్టెన్సీలో జూనియర్ ప్రపంచకప్
  • 2019 ప్రపంచకప్ వైపు కెప్టెన్ గా కొహ్లీ చూపు

వన్డే క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్, భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ…అరుదైన రికార్డుల కోసం తహతహలాడుతున్నాడు.
2008 జూనియర్ ప్రపంచకప్ లో భారత్ కు ట్రోఫీ అందించిన కొహ్లీ…2019 వన్డే ప్రపంచకప్ ను సైతం…కెప్టెన్ గా అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఢిల్లీ క్రికెట్ నుంచి భారత జూనియర్ క్రికెట్లోకి…జూనియర్ స్థాయి నుంచి సీనియర్ జట్టులోకి దూసుకొచ్చిన విరాట్ కొహ్లీ…
మూడుఫార్మాట్లలోనూ భారత్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో కెప్టెన్ గా ఎనిమిది వరుస సిరీస్ విజయాలు అందించిన కొహ్లీ..ఇంగ్లండ్ వేదికగా ఈనెల 30 నుంచి ప్రారంభమయ్యే.. వన్డే ప్రపంచకప్ ను సైతం సాధించాలన్న లక్ష్యంతో ఇంగ్లండ్ లో అడుగు పెట్టాడు.

వన్డేల్లో 41 శతకాలు…

తన కెరియర్ లో కేవలం మూడు పదుల వయసులోనే కొహ్లీ సాధించిన 66 సెంచరీలలో…41 వన్డే శతకాలు ఉన్నాయి.
ఆటగాడిగా కొహ్లీ సత్తా చాటుకొన్నా… కెప్టెన్ గా ప్రపంచకప్ లో సైతం తానేమిటో చాటుకోవాలన్న కసితో ఉన్నాడు.
పటిష్టమైనడిఫెన్స్, పదునైన షాట్లతో దూకుడుగా ఆడే కొహ్లీ…ప్రపంచకప్ లో తన జట్టును ముందుండి నడిపించాలన్న
లక్ష్యంతో సిద్ధమయ్యాడు.

ఇదే అత్యుత్తమ జట్టు….

ప్రపంచకప్ చరిత్రలోనే అత్యుత్తమ భారతజట్టుగా చాటుకొనే సత్తా తమకు ఉందని…బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సమతూకంతో ఉన్న తమకు ప్రపంచకప్ సాధించే అర్హత ఉందని కొహ్లీ ధీమాగా చెబుతున్నాడు.

మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో విరాట్ సేన…తొమ్మిది ప్రత్యర్థిజట్లతో తలపడాల్సి ఉంది. తొమ్మిదిరౌండ్లలో ఆరు విజయాలు సాధించగలిగితేనే సెమీస్ బెర్‌ ఖాయమవుతుంది.

భారతజట్టు తన ప్రారంభమ్యాచ్ ను జూన్ 5న పవర్ ఫుల్ సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా లాంటి హేమాహేమీ జట్లతో పాటు… మాజీచాంపియన్ వెస్టిండీస్, శ్రీలంక, సంచలనాల అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

First Published:  24 May 2019 2:40 AM IST
Next Story