Telugu Global
NEWS

ఓటమి మీ వల్లే.... కాదు మీ వల్లే....: బాబు.... సీనియర్ ల చర్చ

“ఇంత దారుణమైన ఓటమికి కారణం మీరే. మీరు చేసిన అవినీతి అక్రమాల వల్లే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయింది” – ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. “కాదు కాదు ఈ ఓటమికి నైతిక బాధ్యత అంతా మీదే. ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్న సమయంలో అదేమైనా సంజీవినా అంటూ మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరిచిపోలేదు. ఈ ఓటమికి నైతిక బాధ్యత కచ్చితంగా మీదే” – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. […]

ఓటమి మీ వల్లే.... కాదు మీ వల్లే....: బాబు.... సీనియర్ ల చర్చ
X

“ఇంత దారుణమైన ఓటమికి కారణం మీరే. మీరు చేసిన అవినీతి అక్రమాల వల్లే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయింది” – ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

“కాదు కాదు ఈ ఓటమికి నైతిక బాధ్యత అంతా మీదే. ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్న సమయంలో అదేమైనా సంజీవినా అంటూ మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజలు మరిచిపోలేదు. ఈ ఓటమికి నైతిక బాధ్యత కచ్చితంగా మీదే” – తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకు అందుబాటులో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో సమాలోచనలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

టెలీ కాన్ఫరెన్స్ తో పాటు తనను కలిసిన కొందరు నాయకులతో కూడా ఫలితాల తీరుపై చంద్రబాబు చర్చలు జరిపినట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమి తప్పదు అంటూ ఎన్నిసార్లు చెప్పినా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఒకసారి, నిఘా నివేదికలు మనకి అనుకూలంగా ఉన్నాయని ఇంకోసారి చెబుతూ పార్టీ నాయకులను తప్పుదోవ పట్టించారని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు నాయుడుకి స్పష్టం చేసినట్లు సమాచారం.

పసుపు కుంకుమ, ఫించన్లు వంటివి ఇచ్చినా ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణం ముఖ్యమంత్రి పనితీరే అని, నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా చివరి మూడు నెలల్లో తాయిలాలు ఇస్తే నమ్మడానికి ప్రజలు ఏమైనా అమాయకులా? అంటూ కొందరు నాయకులు తమలో తాము చర్చించుకున్నట్లు చెబుతున్నారు.

తొలి నుంచి పార్టీలో అందరితో కలిసి వెళ్లాలని తాను చెబుతున్నానని, అయితే సీనియర్ నాయకుల మధ్య గ్రూపుల కారణంగా నేడు దారుణమైన ఓటమి చవి చూడాల్సి వచ్చిందని చంద్రబాబు నాయుడు అన్నట్లు చెబుతున్నారు. ఒక శాసనసభ్యుడు చేసిన తప్పు ఆ నియోజకవర్గానికే పరిమితం కాదని, మీడియా విస్తరించిన నేపథ్యంలో దాని ప్రభావం పార్టీ మీద పడుతుందని తాను చేసిన హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు అన్నట్లు చెబుతున్నారు.

అయితే చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాస రావు లాంటి ఎమ్మెల్యేల ఆగడాలను ప్రోత్సహించింది చంద్రబాబు కాదా? అని అనుచరులు అంటున్నారు.

అయితే, పార్టీ సీనియర్ నాయకులు మాత్రం కేంద్రంతో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు, పాలన పట్ల వచ్చిన వ్యతిరేకతే కొంప ముంచాయని అన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఓటమికి మీరంటే మీరే కారణమని చంద్రబాబు నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు వాదులాడుకున్నట్లుగా చెబుతున్నారు.

First Published:  24 May 2019 4:59 AM IST
Next Story