కొహ్లీ తోనే ప్రపంచకప్ రాదు
జట్టుగా రాణిస్తేనే భారత్ కు ప్రపంచకప్ విరాట్ సేనకు మాస్టర్ సచిన్ సలహా రెండు కొత్త బంతులతో రివర్స్ స్వింగ్ అసాధ్యమన్న సచిన్ రెండుసార్లు విశ్వవిజేత టీమిండియా మూడోసారి ప్రపంచకప్ సాధించాలంటే…కెప్టెన్ విరాట్ కొహ్లీ రాణిస్తే సరిపోదని..జట్టులోని మిగిలిన సభ్యులంతా కలిసి సమిష్టిగా రాణించక తప్పదని మాస్టర్ సచిన్ టెండుల్కర్ అన్నాడు. తన కెరియర్ లో ఆరు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొని… ఓసారి విశ్వవిజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న మాస్టర్ సచిన్… 2019 ప్రపంచకప్ లో టీమిండియా అవకాశాల […]
- జట్టుగా రాణిస్తేనే భారత్ కు ప్రపంచకప్
- విరాట్ సేనకు మాస్టర్ సచిన్ సలహా
- రెండు కొత్త బంతులతో రివర్స్ స్వింగ్ అసాధ్యమన్న సచిన్
రెండుసార్లు విశ్వవిజేత టీమిండియా మూడోసారి ప్రపంచకప్ సాధించాలంటే…కెప్టెన్ విరాట్ కొహ్లీ రాణిస్తే సరిపోదని..జట్టులోని మిగిలిన సభ్యులంతా కలిసి సమిష్టిగా రాణించక తప్పదని మాస్టర్ సచిన్ టెండుల్కర్ అన్నాడు.
తన కెరియర్ లో ఆరు ప్రపంచకప్ టోర్నీలో పాల్గొని… ఓసారి విశ్వవిజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న మాస్టర్ సచిన్… 2019 ప్రపంచకప్ లో టీమిండియా అవకాశాల గురించి తన అభిప్రాయాలను పంచుకొన్నాడు.
నంబర్ 4 సమస్యకానే కాదు….
ప్రపంచకప్ లో టీమిండియా రెండోడౌన్ ఆటగాడు ఎవరన్న విషయం ప్రధానం కానే కాదని… నాలుగో నంబర్ అన్నది కేవలం ఓ సంఖ్య మాత్రమేనని మాస్టర్ గుర్తు చేశాడు.
మ్యాచ్ రోజున పరిస్థితులకు తగ్గట్టుగా జట్టు కూర్పు ఉండితీరాలని… 8 నుంచి 10 సంవత్సరాల అంతర్జాతీయ అనుభవం ఉన్న సీనియర్లతో పాటు.. చాహల్, పాండ్యా, కుల్దీప్ లాంటి యువఆటగాళ్లు సైతం భారత జట్టులో సభ్యులుగా ఉండటంతో సమతౌల్యం వచ్చిందని తెలిపాడు.
కొహ్లీ పైనే భారం తగదు….
భారత జట్టు విశ్వవిజేతగా నిలవాలంటే… కొహ్లీ మాత్రమే స్థాయికి తగ్గట్టుగా ఆడితే సరిపోదని… జట్టులోని మిగిలిన ఆటగాళ్లు తమవంతు పాత్ర నిర్వర్తించాలని సచిన్ కోరాడు.
ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్ లో స్పిన్ జోడీ చాహల్, కుల్దీప్ యాదవ్ ఏమాత్రం ప్రభావం చూపకపోడాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదనీ, ప్రపంచకప్ లో లోపాలు సవరించుకొని వికెట్లు సాధించే అవకాశం ఉంటుందని మాస్టర్ చెప్పాడు.
రివర్స్ స్వింగ్ అసాధ్యం…
బౌలింగ్ కు ఏమాత్రం అనువుకాని ఇంగ్లండ్ డ్రై పిచ్ లపై రెండు కొత్త బంతులతో ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడటమంటే…రివర్స్ స్వింగ్ కు ఏమాత్రం అవకాశం ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని సచిన్ తెలిపాడు.
కూకూబురా బ్రాండ్ బాల్స్ ను ప్రపంచకప్ లో ఉపయోగించడం ఇబ్బందికరమేనని మాస్టర్ అభిప్రాయపడ్డాడు.
రౌండ్ రాబిన్ లీగ్ సవాల్…
1992 ప్రపంచకప్ తర్వాత…తొలిసారిగా 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్ ను ప్రవేశపెట్టడం జట్ల సత్తాకు అసలుసిసలు సవాలని సచిన్ అన్నాడు.
తొమ్మిది ప్రత్యర్థిజట్లతో తలపడటం నిలకడగా రాణించే జట్లకే మేలు చేస్తుందని…సెమీస్ చేరాలంటే కనీసం ఆరుమ్యాచ్ లు
నెగ్గితీరాల్సి ఉంటుందని…ప్రతీమ్యాచ్ కీలకమేనని చెప్పాడు.
నాలుగున్నర దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో…అత్యంత కష్టమైన, క్లిష్టమైన ప్రపంచకప్ టోర్నీ గా ..2019 టోర్నీ మిగిలిపోతుందని సచిన్ అన్నాడు.
మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే ఈటోర్నీ కోసం… ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులతో పాటు తాను ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు సచిన్ వివరించాడు.