Telugu Global
Cinema & Entertainment

మా నాన్నకు నచ్చని సీత

సాధారణంగా సినిమా ప్రమోషన్ లో తమ సినిమా చాలా గొప్పది అన్నట్టు మాట్లాడుతుంటారు సినీజనాలు. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, రిలీజ్ కు ముందు మాత్రం దాన్నొక బ్లాక్ బస్టర్ గా ప్రచారం చేస్తుంటారు. అయితే సీత విషయంలో మాత్రం బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాస్త రివర్స్ లో వెళ్తున్నాడు. సీత కథ తన తండ్రికి నచ్చలేదంటున్నాడు ఈ హీరో. “ముందుగా తేజ గారు నాకు రెండు కథలు వినిపించారు. నాన్న కూడా నా పక్కనే ఉండి ఆ […]

మా నాన్నకు నచ్చని సీత
X

సాధారణంగా సినిమా ప్రమోషన్ లో తమ సినిమా చాలా గొప్పది అన్నట్టు మాట్లాడుతుంటారు సినీజనాలు. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ, రిలీజ్ కు ముందు మాత్రం దాన్నొక బ్లాక్ బస్టర్ గా ప్రచారం చేస్తుంటారు. అయితే సీత విషయంలో మాత్రం బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాస్త రివర్స్ లో వెళ్తున్నాడు. సీత కథ తన తండ్రికి నచ్చలేదంటున్నాడు ఈ హీరో.

“ముందుగా తేజ గారు నాకు రెండు కథలు వినిపించారు. నాన్న కూడా నా పక్కనే ఉండి ఆ కథలు విన్నారు. నాన్న కి ఇంకో కథ నచ్చింది. నాకు మాత్రం సీత కథే బాగా నచ్చింది. తేజ గారు చెప్పిన ఇంకో కథ మాస్ యాక్షన్ సినిమా. అందువల్లే నాన్నకి ఆ కథ బాగా నచ్చింది. నేను మాత్రం ‘సీత’ లాంటి కథ కోసం ఎదురుచూస్తున్నాను. నటుడిగా ప్రూవ్ చేసుకునే ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి.”

ఇలా తన తండ్రికి ఇష్టంలేకపోయినా సీత సినిమా చేశానంటున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. సినిమా చూసిన తర్వాత నాన్న కూడా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని, అమ్మ అయితే క్లైమాక్స్ చూసి ఏడ్చేసిందని చెప్పుకొచ్చాడు బెల్లంకొండ.

సినిమాలో తనకంటే కాజల్ కే ఎక్కువ స్కోప్ ఉందనే విషయాన్ని అంగీకరించాడు ఈ హీరో. ఇద్దరి పాత్రలు బాగుంటాయని, కానీ తన క్యారెక్టర్ కంటే సీత పాత్ర ఇంకా చాలా బాగుంటుందని అంటున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది సీత.

First Published:  22 May 2019 9:30 PM GMT
Next Story