సాహో పోస్టర్.... అక్కడ్నుంచి కాపీ కొట్టారట
రిలీజ్ చేసింది కేవలం ఓ పోస్టర్ మాత్రమే. దానికి ఇచ్చిన బిల్డప్ మాత్రం అంతాఇంతా కాదు. ఏకంగా సినిమా రిలీజ్ అవుతోందన్నంతగా ఊదరగొట్టారు. ప్రభాస్ తో ఏకంగా వీడియో రిలీజ్ చేయించారు. ఇంతా చేసి రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు. పైపెచ్చు మంచు విష్ణును గుర్తుచేసింది సాహో పోస్టర్. కొన్నాళ్ల కిందట ఇదే సెటప్ తో, అదే అద్దాలతో మంచు విష్ణు ఓ ఫొటో షూట్ చేయించుకున్నాడు. ఆ స్టిల్స్ అప్పట్లో […]
రిలీజ్ చేసింది కేవలం ఓ పోస్టర్ మాత్రమే. దానికి ఇచ్చిన బిల్డప్ మాత్రం అంతాఇంతా కాదు. ఏకంగా సినిమా రిలీజ్ అవుతోందన్నంతగా ఊదరగొట్టారు. ప్రభాస్ తో ఏకంగా వీడియో రిలీజ్ చేయించారు. ఇంతా చేసి రిలీజ్ చేసిన పోస్టర్ లో మాత్రం ప్రేక్షకులకు కొత్తదనం కనిపించలేదు. పైపెచ్చు మంచు విష్ణును గుర్తుచేసింది సాహో పోస్టర్.
కొన్నాళ్ల కిందట ఇదే సెటప్ తో, అదే అద్దాలతో మంచు విష్ణు ఓ ఫొటో షూట్ చేయించుకున్నాడు. ఆ స్టిల్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. దాదాపు ప్రభాస్ లుక్ కూడా అలానే ఉంది. ఆకస్మికంగా చూస్తే ప్రభాస్ బదులు మంచు విష్ణు మాత్రమే కనిపిస్తాడు. అందుకే సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి.
Here it is darlings, for all of you… The new official poster of my next film Saaho. See you in theatres on 15th August!Shraddha Kapoor Sujeeth UV Creations T-Series #BhushanKumar
Posted by Prabhas on Monday, 20 May 2019
ఇదొక ఎత్తయితే, ఇంతకంటే పెద్ద విమర్శ ఇంకోటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సినిమా వాల్ పోస్టర్ ను ఓ హాలీవుడ్ సిరీస్ నుంచి కాపీ కొట్టారంటూ మరికొందరు ఉదాహరణలు చూపిస్తున్నారు. అమెరికాలో సూపర్ హిట్ అయిన బ్రేకింగ్-బ్యాడ్ అనే టెలివిజన్ సిరీస్ కు సరిగ్గా ఇలాంటి ప్రచారమే చేశారు. ఆ పోస్టర్, సాహో పోస్టర్ ఒకేలా కనిపిస్తాయి. ఈ స్టిల్స్ ను కూడా సోషల్ మీడియాలో పెట్టి సాహో లుక్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు.
అసలే 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్. ఇలాంటి సినిమాకు సంబంధించి ఓంప్రథమంగా చేపట్టిన ప్రచారమే రివర్స్ అవ్వడంతో సాహో యూనిట్ డైలమాలో పడింది. ఆగస్ట్ 15న మూవీ థియేటర్లలోకి రానుంది.
Hello darlings… A surprise coming your way, tomorrow. Stay tuned…Instagram.com/ActorPrabhas
Posted by Prabhas on Sunday, 19 May 2019