ఇస్రో ఘనవిజయం.... కక్ష్యలోకి రీశాట్ " 2బీఆర్1
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ ఉదయం 5.30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ – సీ46 రాకెట్‌ను ప్రయోగించింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ వాహక నౌక ద్వారా రీశాట్ – 2బీఆర్1 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోని ప్రవేశపెట్టింది. 615 కిలోల బరువున్న రీశాట్ – 2బీఆర్1.. రాడార్ ఇమేజింగ్ ద్వారా భూపరిశీలన జరపడానికి ఉపయోగిస్తారు. దీన్ని 557 కిలోమీటర్ల ఎత్తులో […]
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ ఉదయం 5.30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ – సీ46 రాకెట్‌ను ప్రయోగించింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ వాహక నౌక ద్వారా రీశాట్ – 2బీఆర్1 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోని ప్రవేశపెట్టింది.
615 కిలోల బరువున్న రీశాట్ – 2బీఆర్1.. రాడార్ ఇమేజింగ్ ద్వారా భూపరిశీలన జరపడానికి ఉపయోగిస్తారు. దీన్ని 557 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత ప్రయోగం ప్రారంభం కాగా.. రాకెట్ 15.29 నిమిషాల పాటు ప్రయాణించి ఉపగ్రహాన్ని కక్ష్యలో ఉంచింది.
రీశాట్ ఉపగ్రహాల్లో ఇది మూడోది. మొదటిగా 2009లో రీశాట్‌ను, 2012లో రీశాట్ – 1ని ఇస్రో ప్రయోగించింది. ఇక ఇవాళ ప్రయోగించిన ఉపగ్రహం రక్షణ శాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల వద్ద శత్రుదేశ కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించగలుగుతుంది. అంతే కాక వ్యవసాయం, అటవీ సంపదకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. ప్రకృతి విపత్తుల సమయంలో అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది.