Telugu Global
NEWS

ఢిల్లీ వదిలేసి.... గంగమ్మ జాతరకు

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం కుటుంబ సమేతంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగే గంగమ్మ జాతరలో వారంతా పాల్గొంటారని సమాచారం. నిన్న మొన్నటి వరకు ఢిల్లీకి, అమరావతికి దేశంలోని వివిధ నగరాలకు విరామం ఎరుగకుండా ప్రయాణాలు చేసిన చంద్రబాబు హఠాత్తుగా కుటుంబంతో కలిసి కుప్పం నియోజకవర్గానికి బయలుదేరాలనుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్న తరుణంలో ఆయన తన సొంత నియోజకవర్గం […]

ఢిల్లీ వదిలేసి.... గంగమ్మ జాతరకు
X

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం కుటుంబ సమేతంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగే గంగమ్మ జాతరలో వారంతా పాల్గొంటారని సమాచారం.

నిన్న మొన్నటి వరకు ఢిల్లీకి, అమరావతికి దేశంలోని వివిధ నగరాలకు విరామం ఎరుగకుండా ప్రయాణాలు చేసిన చంద్రబాబు హఠాత్తుగా కుటుంబంతో కలిసి కుప్పం నియోజకవర్గానికి బయలుదేరాలనుకోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనాలు వెలువడుతున్న తరుణంలో ఆయన తన సొంత నియోజకవర్గం పర్యటన పెట్టుకున్నారు. గురువారమే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. బహుశా చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఇదే చివరి ఉత్సవ పర్యటన కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మంగళవారం ఆయన ఢిల్లీలో హల్ చల్ చేశారు. ఈసీ కార్యాలయం ముందు ధర్నా చేయాలని భావించి విపక్ష నేతలందరినీ స్వయంగా కలిసి ఆహ్వానించారు. కానీ, కేజ్రీవాల్ తప్ప కీలక నేతలెవ్వరూ అంతగా స్పందించలేదు. ఆయా పార్టీలు తమ ప్రతినిధులను మాత్రం పంపించి చేతులు దులుపుకున్నాయి. చివరకు రాహుల్ గాంధీ కూడా రాకుండా కాంగ్రెస్ ప్రతినిధిగా గులాం నబీ ఆజాద్ ను పంపించారు.

ఇక చంద్రబాబు ఏమీ చేయలేక ధర్నా ఆలోచనను విరమించుకుని
ఈసీకి ఓ వినతిపత్రాన్ని సమర్పించి సరిపుచ్చుకున్నారు. ఈవీఎంల కంటే ముందుగా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విన్నవించి వచ్చారు.

ఈవీఎంలకు, స్లిప్పులకు తేడా వస్తే మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించాలనీ కోరారు. ఈసీ అధికారులు వారికి ఏమీ చెప్పకుండానే వినతి పత్రాన్ని మాత్రం తీసుకుని పంపించేశారు.

మరో వైపు ఈవీఎంల కంటే ముందుగా వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ రకంగా చంద్రబాబుకు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ఎక్కడా తన పన్నాగాలు పారకపోవడంతో పాపం చంద్రబాబు పూర్తిగా ఢీలా పడిపోయారని అంటున్నారు.

ఒకనాడు హస్తినను తన కనుసైగలతో శాసించానని చెప్పే తమ అధినేతకు నేడు మాత్రం అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని టీడీపీ సీనియర్ నేతలు వాపోతున్నారట.

ఈ క్రమంలోనే కుప్పంలో జరుగుతున్న గంగమ్మ జాతరకు చంద్రబాబు కుటుంబంతో సహా బయలుదేరడం పలువురిని ఆకర్షిస్తోంది. గంగమ్మ జాతరే చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి హోదాలో చివరి యాత్రగా మిగులుతుందా అని పార్టీ నాయకులు అనుకుంటున్నారు.

First Published:  22 May 2019 4:09 AM IST
Next Story