Telugu Global
NEWS

ఓడిపోతే ఏం చేద్దాం...?

ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. దాదాపు అన్ని పార్టీలలో విజయావకాశాల మీద ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇందుకు అతీతం కాదు… కాకపోతే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. విజయం తమదేనని పదేపదే ప్రకటిస్తున్నా, పరాజయం తప్పదేమోనని ఆయన లోలోపల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే భవిష్యత్ వ్యూహాల గురించి ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో అధికారం […]

ఓడిపోతే ఏం చేద్దాం...?
X

ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే మిగిలి ఉంది. దాదాపు అన్ని పార్టీలలో విజయావకాశాల మీద ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇందుకు అతీతం కాదు… కాకపోతే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

విజయం తమదేనని పదేపదే ప్రకటిస్తున్నా, పరాజయం తప్పదేమోనని ఆయన లోలోపల ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే భవిష్యత్ వ్యూహాల గురించి ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.

రాష్ట్రంలో అధికారం కోల్పోతే, ఢిల్లీలో విపక్షాల కూటమి గద్దెను ఎక్కకపోతే తమను కష్టాలు వెంటాడతాయని, వీటిని ఎదుర్కోవాలంటే తాము ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోక తప్పదని చంద్రబాబు వారికి వివరించినట్టు తెలిసింది. రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ, ప్రతిపక్ష పార్టీలన్నింటిని ఒకేతాటిపై నడిపించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. వీలైతే విపక్షాల కూటమికి తానే నాయకత్వం వహించాలని ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు.

అందుకే ఆయా నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అంటున్నారు. ఏపీలో అధికారం కోల్పోతే ఇక తమకు ఇక్కడ పని ఏమీ ఉండదు కాబట్టి జాతీయ రాజకీయాలలోనే బిజీ కావాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

విచిత్రమేమిటంటే సహచరులతో ఈ చర్చలు జరుపుతున్నసమయంలోనూ ఏపీలో టీడీపీ గెలుపు మీద భరోసాను కూడా చంద్రబాబు వీడడం లేదట. దీంతో సదరు నాయకులు కూడా ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు. తెర వెనుక ఏదో జరుగుతోందని వారు అనుమానిస్తున్నట్టు తెలిసింది. లేకపోతే చంద్రబాబు గెలుపు మీద ఇంత నమ్మకంగా ఎలా మాట్లాడతారని తమలో తాము చర్చించుకుంటున్నారట.

మరోవైపు పార్టీలోని మరి కొందరు సీనియర్ నాయకులు ఓటమికి మానసికంగా ఎప్పుడో సిద్ధం అయిపోయారట. కొందరికి లాభం చేకూర్చేందుకుకే లగడపాటి రాజగోపాల్ తన అంచనా ఫలితాలు ప్రకటించారని కొందరు నాయకుల విమర్శిస్తున్నారు. మరికొందరు నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తమకు పరాజయం తప్పదనే నిర్ధారణకు వచ్చారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

First Published:  22 May 2019 5:30 AM IST
Next Story