Telugu Global
NEWS

ఏపీలో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పిన ఇండియా టుడే

ఇండియా టుడే అంచనాలు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో నిజమయ్యాయి. టీఆర్ఎస్ 80కు పైగా సీట్లు వస్తాయని వేసిన అంచనా అక్షరాల వాస్తవమైంది. ఇక జాతీయ చానెళ్లలో స్వతంత్రంగా వార్తలు ఇవ్వడంలో మంచి క్రెడిబులిటీ ఇండియా టుడేకు ఉంది. రాజ్ దీప్ సర్దేశాయ్ ఎక్జిక్యూటివ్ ఎడిటర్ గా దీన్ని నడిపిస్తున్నారు. ఇండియా టుడే కూడా ఇటీవల విడుదల చేసిన సర్వేలో కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే తాజాగా తాము చేసి సర్వేను […]

ఏపీలో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుస్తుందో చెప్పిన ఇండియా టుడే
X

ఇండియా టుడే అంచనాలు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో నిజమయ్యాయి. టీఆర్ఎస్ 80కు పైగా సీట్లు వస్తాయని వేసిన అంచనా అక్షరాల వాస్తవమైంది. ఇక జాతీయ చానెళ్లలో స్వతంత్రంగా వార్తలు ఇవ్వడంలో మంచి క్రెడిబులిటీ ఇండియా టుడేకు ఉంది.

రాజ్ దీప్ సర్దేశాయ్ ఎక్జిక్యూటివ్ ఎడిటర్ గా దీన్ని నడిపిస్తున్నారు. ఇండియా టుడే కూడా ఇటీవల విడుదల చేసిన సర్వేలో కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేసింది.

అయితే తాజాగా తాము చేసి సర్వేను ఎంపీ సీట్ల వారీగా బయటపెట్టింది. ఒక్కో లోక్ సభ పరిధిలో గెలుపు ఎవరిది అనేది తెలిపింది.

లోక్ సభ స్థానాల వారీగా ఇండియా టుడే వైసీపీ, టీడీపీ గెలిచే స్థానాలపై అంచనావేసింది.

విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, నరసరావుపేట, హిందూపూర్, రాజంపేట, కర్నూలు, నంద్యాల, బాపట్ల, ఏలూరు, అరకు, ఒంగోలు, నర్సాపురం, కడప, నెల్లూరు, తిరుపతి లోక్ సభ సీట్లను వైసీపీ గెలుస్తుందని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది.
ఇక 6 చోట్ల టీడీపీ-వైసీపీ మధ్య టఫ్ ఫైట్ ఉందని తెలిపింది.

చిత్తూరు, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, అనంతపురం, శ్రీకాకుళంలలో టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీ పోటీ ఉంటుందని ఇండియా టుడే అంచావేసింది. అయితే టీడీపీ గెలిచే ఖచ్చితమైన ఒక్క ఎంపీ సీటును కూడా ఇండియా టుడే తెలపలేకపోవడంతో టీడీపీ శిభిరం షాక్ తిన్నది.

ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీచేసిన విశాఖలో మాత్రం జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే అంచనా వేసింది.

జనసేన తరుఫున గెలిచే ఒక్క ఎంపీ సీటు విశాఖ కావచ్చని.. సీబీఐ జేడీకి బాగానే ఓట్లు పడ్డాయని నివేదికలో తెలిపింది.

ఇలా టీడీపీ ఒక్క ఎంపీ సీటు కూడా ఖచ్చితంగా గెలుస్తుందని ఇండియా టుడే చెప్పకపోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. 6 చోట్ల హోరాహోరీలో గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. దీన్ని బట్టి ఏపీలో వైసీపీకి 18, టీడీపీ 6 ప్లస్ ఆర్ మైనస్, జనసేనకు 1 ఎంపీ సీటు వస్తుందని ఇండియా టుడే సర్వేలో పేర్కొంది.

First Published:  21 May 2019 7:51 AM IST
Next Story