Telugu Global
NEWS

బెజవాడోడు.... వాడికేం తెలుసు? " లగడపాటి సర్వేపై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

ఒకవైపు చంద్రబాబు నూటికి వెయ్యి శాతం టీడీపీనే గెలుస్తుందంటూ కళ్ళు పెద్దవి చేసి, పెద్దగా నవ్వుతూ మరీ ప్రెస్‌మీట్లలో ఎంత గట్టిగా చెబుతున్నా…. ఆయన మాటలను సొంత పార్టీనేతలే కాదు ఏకంగా క్యాబినెట్‌ మంత్రే విశ్వసించడంలేదు. చంద్రబాబు వెయ్యిశాతం టీడీపీ గెలుస్తుందంటే… ఆ వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ ఓడిపోతుందన్న నమ్మకంతో ఆ పార్టీలు నాయకులు, కార్యకర్తలు ఉన్నట్లుగా ఉంది అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే…. విలేకరులతో చర్చాగోష్టిలో అయ్యన్నపాత్రుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు […]

బెజవాడోడు.... వాడికేం తెలుసు?  లగడపాటి సర్వేపై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
X

ఒకవైపు చంద్రబాబు నూటికి వెయ్యి శాతం టీడీపీనే గెలుస్తుందంటూ కళ్ళు పెద్దవి చేసి, పెద్దగా నవ్వుతూ మరీ ప్రెస్‌మీట్లలో ఎంత గట్టిగా చెబుతున్నా…. ఆయన మాటలను సొంత పార్టీనేతలే కాదు ఏకంగా క్యాబినెట్‌ మంత్రే విశ్వసించడంలేదు. చంద్రబాబు వెయ్యిశాతం టీడీపీ గెలుస్తుందంటే… ఆ వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ ఓడిపోతుందన్న నమ్మకంతో ఆ పార్టీలు నాయకులు, కార్యకర్తలు ఉన్నట్లుగా ఉంది అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే….

విలేకరులతో చర్చాగోష్టిలో అయ్యన్నపాత్రుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో అయ్యన్న సంచలన వ్యాఖ్యలే చేశాడు.

లగడపాటి సర్వేలపై మండిపడ్డారు అయ్యన్నపాత్రుడు. ఆయన సర్వే ఒక ఫేక్‌ అంటూ కొట్టిపడేశాడు. ఆ సర్వే కేవలం బెట్టింగ్‌ రాయుళ్ళకు సహకరించడానికి చేసిందేనని చెప్పారు. ఈ సర్వేల వల్ల ఆయనకు ఏం నష్టం లేదని…. మీలాంటి కార్యకర్తలే నష్టపోతారన్నారు. ప్రజల నాడి తెలియకుండా ఏం సర్వేలు చేస్తారంటూ లగడపాటి పై మండిపడ్డారు ఆయన. ప్రస్తుత పరిస్థితులను చూస్తే అర్థమౌతుంది కదా… ఫలితాలు ఎలా ఉంటాయో…రెండు రోజులు ఆగితే తెలియదా…? ఈపాటి దానికి సర్వేలు చేయాలా? అని ప్రశ్నించారు.

“ప్రజల నాడి తెలిసినోడు సర్వేలు చేయాలి…. ప్రతోడు సర్వేలు చేస్తానంటే ఎలా? తెలంగాణ ఎన్నికలప్పుడు ఈ ఎగ్జిపోల్స్‌ వల్ల కోట్లు తగలేసుకున్నారు….. అసలు ఆ బెజవాడోడు ఎవడు?… ఆ లగడపాటి రాజగోపాల్‌…. విజయవాడలో కూర్చున్న ఆయనకు ప్రజల నాడి ఎలా తెలుస్తది? వాడి వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి…. ఆయనకు ఏం నష్టం లేదు…. చాలామంది ఆ ఎగ్జిట్‌ పోల్స్‌ వల్ల సర్వనాశం అయ్యారు…” అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు.

లగడపాటి సర్వేల వల్ల కొన్ని కుటుంబాలు నష్టపోయాయని…. ఈయనగారి సర్వేలని నమ్మి బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని…. ఇలాంటి సర్వేలను నమ్మవద్దంటూ కార్యకర్తలకు సూచనలు చేశారు.

తెలంగాణ ఎన్నికలలో లగడపాటి ఎగ్జిట్‌ పోల్స్‌ను నమ్మి ఏకంగా వెయ్యికోట్లకు పైగా బెట్టింగులు పెట్టి పోగొట్టుకున్నారన్నారు. తాను హైదరాబాద్‌లో ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జిట్‌ పోల్స్‌ నమ్మి బెట్టింగ్‌లు పెట్టి మునిగిపోయామని చాలామంది తన వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కాబట్టి ఇలాంటి దొంగ సర్వేల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇండైరెక్ట్‌గా టీడీపీ ఓడిపోబోతుందని, బెట్టింగ్‌లు పెట్టి నష్టపోవద్దని కార్యకర్తలకు చెప్పారు అయ్యన్న పాత్రుడు.

First Published:  21 May 2019 11:25 AM IST
Next Story