రేపట్నుంచి సాహో అధికారిక ప్రచారం
సాహో సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ జరిగిన ప్రచారం అఫీషియల్ కాదు. 2 మేకింగ్ వీడియోస్ మాత్రమే అఫీషియల్ గా రిలీజయ్యాయి. అవి కూడా ప్రభాస్, శ్రద్ధాకపూర్ పుట్టినరోజులు సందర్భంగా విడుదల చేశారు. ఇకపై ఇలా అడపాదడపా ప్రచారం కాకుండా.. పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని నిర్ణయించింది సాహో యూనిట్. దీనికి సంబంధించి ఈరోజు ప్రభాస్ స్పష్టమైన ప్రకటన చేశాడు. ఈరోజు ఫేస్ బుక్ లోకి వచ్చాడు ప్రభాస్. తన వీడియోను పోస్ట్ చేశాడు. రేపట్నుంచి సాహో ప్రచారాన్ని అఫీషియల్ […]

సాహో సినిమాకు సంబంధించి ఇన్నాళ్లూ జరిగిన ప్రచారం అఫీషియల్ కాదు. 2 మేకింగ్ వీడియోస్ మాత్రమే అఫీషియల్ గా రిలీజయ్యాయి. అవి కూడా ప్రభాస్, శ్రద్ధాకపూర్ పుట్టినరోజులు సందర్భంగా విడుదల చేశారు. ఇకపై ఇలా అడపాదడపా ప్రచారం కాకుండా.. పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని నిర్ణయించింది సాహో యూనిట్. దీనికి సంబంధించి ఈరోజు ప్రభాస్ స్పష్టమైన ప్రకటన చేశాడు.
ఈరోజు ఫేస్ బుక్ లోకి వచ్చాడు ప్రభాస్. తన వీడియోను పోస్ట్ చేశాడు. రేపట్నుంచి సాహో ప్రచారాన్ని అఫీషియల్ గా చేపట్టబోతున్నట్టు, తన ఇనస్టాగ్రామ్ పేజ్ ను చెక్ చేయాల్సిందిగా అందులో చెప్పాడు. అయితే రేపు యూనిట్ ఏం రిలీజ్ చేయబోతోందనే విషయం ఈరోజే లీకైంది.
సాహో సినిమాకు సంబంధించి రేపు బ్రాండ్ న్యూ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు పార్క్ హయత్ హోటల్ లో ప్రభాస్ పై భారీ ఫొటో షూట్ నిర్వహించారు. ఈ ఫోటోలతో ప్రచారాన్ని మెల్లగా స్టార్ట్ చేసి, ఆగస్ట్ నాటికి హోరెత్తించాలని నిర్ణయించారు. ఆగస్ట్ 15న సాహో సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
Hello darlings… A surprise coming your way, tomorrow. Stay tuned…Instagram.com/ActorPrabhas
Posted by Prabhas on Sunday, 19 May 2019