Telugu Global
NEWS

వన్డే క్రికెట్లో పాకిస్థాన్ అరుదైన రికార్డు

వరుసగా మూడుమ్యాచ్ ల్లో 340కి పైగా స్కోర్లు మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ ఓడిన పాక్  పాక్ రికార్డును అధిగమించిన జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచకప్ కు సన్నాహకంగా ఇంగ్లండ్ తో ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని మూడు వరుస మ్యాచ్ ల్లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ 340కి పైగా స్కోర్లు సాధించీ …పరాజయం పొందిన జట్టుగా రికార్డుల్లో చేరింది. ఈ సిరీస్ లోని రెండు, మూడు, నాలుగు వన్డేలలో పాక్ జట్టు 7 వికెట్లకు […]

వన్డే క్రికెట్లో పాకిస్థాన్ అరుదైన రికార్డు
X
  • వరుసగా మూడుమ్యాచ్ ల్లో 340కి పైగా స్కోర్లు
  • మూడుకు మూడుమ్యాచ్ ల్లోనూ ఓడిన పాక్
  • పాక్ రికార్డును అధిగమించిన జట్టుగా ఇంగ్లండ్

ప్రపంచకప్ కు సన్నాహకంగా ఇంగ్లండ్ తో ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని మూడు వరుస మ్యాచ్ ల్లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ 340కి పైగా స్కోర్లు సాధించీ …పరాజయం పొందిన జట్టుగా రికార్డుల్లో చేరింది.

ఈ సిరీస్ లోని రెండు, మూడు, నాలుగు వన్డేలలో పాక్ జట్టు 7 వికెట్లకు 361, 9 వికెట్లకు 358, 7 వికెట్లకు 340 పరుగుల చొప్పున స్కోర్లు సాధించింది.

నాలుగున్నర దశాబ్దాల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ జట్టు వరుసగా మూడు మ్యాచ్ ల్లో 340కి పైగా స్కోర్లు సాధించడం ఇదే మొదటిసారి.

పాక్ రికార్డుకు ఇంగ్లండ్ చెక్….

పాకిస్థాన్ వరుసగా మూడుమ్యాచ్ ల్లో సాధించిన 340కి పైగా స్కోర్లను ఇంగ్లండ్ జట్టు అలవోకగా అధిగమించడం ద్వారా… రికార్డును బ్రేక్ చేయడమే కాదు.. విజేతగానూ నిలిచింది.

రెండో వన్డేలో 3 వికెట్లకు 373, మూడో వన్డేలో 4 వికెట్లకు 359, నాలుగో వన్డేలో 7 వికెట్లకు 341 పరుగుల స్కోర్లు సాధించడం విశేషం.

అంతే కాదు…వన్డే సిరీస్ లోని మూడుమ్యాచ్ ల్లో రెండుజట్లు 340కి పైగా పరుగులు సాధించడం కూడా ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది.

సౌతాంప్టన్, బ్రిస్టల్, నాటింగ్ హామ్ స్టేడియాలు వేదికలుగా ముగిసిన ఈ వన్డేలలో రికార్డులు నమోదయ్యాయి.

First Published:  20 May 2019 8:30 AM IST
Next Story