Telugu Global
NEWS

చంద్రబాబు ఆశల మీద నీళ్లు...!

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చంద్రబాబు ఆశల మీద దాదాపుగా నీళ్లు చల్లాయి. లగడపాటితో పాటు, మరో రెండు టీవీ చానళ్లు తప్ప మిగతా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని స్పష్టం చేశాయి. ఇది చంద్రబాబుకు మింగుడు పడని విషయమే. ఢిల్లీ రాజకీయాలలో బిజీ గా ఉన్న చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న వేళ హఠాత్తుగా అమరావతికి చేరుకున్నారు. అసలు ఫలితాలు వెలువడడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. […]

చంద్రబాబు ఆశల మీద నీళ్లు...!
X

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చంద్రబాబు ఆశల మీద దాదాపుగా నీళ్లు చల్లాయి. లగడపాటితో పాటు, మరో రెండు టీవీ చానళ్లు తప్ప మిగతా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ఆర్ సీపీ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని స్పష్టం చేశాయి. ఇది చంద్రబాబుకు మింగుడు పడని విషయమే.

ఢిల్లీ రాజకీయాలలో బిజీ గా ఉన్న చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న వేళ హఠాత్తుగా అమరావతికి చేరుకున్నారు. అసలు ఫలితాలు వెలువడడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలే దాదాపుగా నిజమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

శనివారం సాయంత్రం లగడపాటి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అనుకూల వ్యాఖ్యలు చేశాక, ఆదివారం సాయంత్రం ఫలితాల అంచనాలు ప్రకటించాక…. సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.

నెటిజన్లు లగడపాటిని ఓ ఆటాడుకున్నారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే ఏపీలో వైఎస్ఆర్ సీపీ విజయం ఖాయమనే విషయం స్పష్టమవుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వైఎస్ఆర్ సీపీలో ఆనందాన్ని నింపగా, టీడీపీ శ్రేణులను మాత్రం ఆందోళనకు గురి చేశాయంటున్నారు. వారంతా లగడపాటి అంచనాల మీదనే ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు.

ఇటు రాష్ట్రంలో అధికారానికి దూరం కానుండడం, అటు కేంద్రంలోనూ ఎన్డీయేనే తిరిగి అధికారంలోకి వస్తుందనే అంచనాలు వెలువడడంతో చంద్రబాబు అయోమయంలో పడిపోయారని చెబుతున్నారు.

విపక్షాలను ఏకం చేయడానికి గత నెల రోజులుగా తాను పడిన శ్రమ అంతా వృథా అవుతుందేమోనని చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. ఆదివారం సాయంత్రం వెలువడిన అంచనాలు గనుక వాస్తవ రూపం దాలిస్తే విపక్షాలన్నీ ఏకమైనా ఢిల్లీలో సర్కారును ఏర్పాటు చేసే అవకాశం ఉండదు.

మోడీ తిరిగి ప్రధానమంత్రి అయితే, ఇక్కడ జగన్ అధికారం చేపడితే చంద్రబాబుకు తిప్పలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు అధికారాన్ని కోల్పోతే విజయసాయిరెడ్డి చెప్పినట్టు…. ప్రజలు మాకే ఓట్లు వేశారని, ఈవీఎంల మాయతోనే మేం ఓడిపోయామని చెబుతారేమోనని అంటున్నారు. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చంద్రబాబుకు అశనిపాతమేనని అంటున్నారు.

First Published:  20 May 2019 3:06 AM IST
Next Story