Telugu Global
Cinema & Entertainment

పాపులర్ సినిమా నుండి తప్పుకున్న దేవి శ్రీ

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాని ఇప్పుడు తెలుగులో ‘వాల్మీకి’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, అథర్వ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ హరీష్ శంకర్ పూజ హెగ్డే ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా నుండి […]

పాపులర్ సినిమా నుండి తప్పుకున్న దేవి శ్రీ
X

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాని ఇప్పుడు తెలుగులో ‘వాల్మీకి’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, అథర్వ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ హరీష్ శంకర్ పూజ హెగ్డే ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా నుండి తప్పుకోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

హరీష్ శంకర్ మరియు డిఎస్పి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని అందుకని దేవిశ్రీ కావాలని సినిమా నుంచి తప్పుకున్నట్లు గా తెలుస్తోంది. అయినప్పటికీ హరీష్ శంకర్ మాత్రం వెంటనే మిక్కీ జే మేయర్ ని ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుండో ఓ పెద్ద సినిమా అవకాశం కొట్టేసేందుకు ఎదురుచూస్తున్న మిక్కీ జే మేయర్ కు ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ కానుంది. 14రీల్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదివరకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ‘గబ్బర్ సింగ్’, ‘డీజే’ సినిమాలకు దేవి శ్రీ సంగీతాన్ని అందించారు.

First Published:  18 May 2019 10:48 AM IST
Next Story