మహర్షి రీమేక్ లో సల్మాన్
సల్మాన్ ఖాన్ కు రీమేక్స్ కొత్తకాదు. సౌత్ లో ఏదైనా సినిమా పెద్ద హిట్ అయితే దాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఈ హీరోకి. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో రీమేక్స్ విషయంలో అక్షయ్ కుమార్, సల్మాన్ పోటీపడుతుంటారు. అయితే ఈమధ్య కాలంలో రీమేక్స్ కు కాస్త దూరమయ్యాడు సల్మాన్. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న సల్మాన్, ఎట్టకేలకు మరో హిట్ సినిమాపై కన్నేశాడు. అదే మహర్షి. అవును.. మహేష్ నటించిన మహర్షి […]
BY telugunews18 May 2019 11:18 AM IST

X
telugunews Updated On: 18 May 2019 11:18 AM IST
సల్మాన్ ఖాన్ కు రీమేక్స్ కొత్తకాదు. సౌత్ లో ఏదైనా సినిమా పెద్ద హిట్ అయితే దాన్ని హిందీలో రీమేక్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఈ హీరోకి. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో రీమేక్స్ విషయంలో అక్షయ్ కుమార్, సల్మాన్ పోటీపడుతుంటారు. అయితే ఈమధ్య కాలంలో రీమేక్స్ కు కాస్త దూరమయ్యాడు సల్మాన్. అలా లాంగ్ గ్యాప్ తీసుకున్న సల్మాన్, ఎట్టకేలకు మరో హిట్ సినిమాపై కన్నేశాడు. అదే మహర్షి.
అవును.. మహేష్ నటించిన మహర్షి సినిమా గురించి సల్మాన్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయిందని, హిందీలో సల్మాన్ చేస్తే చాలా బాగుంటుందని అతడికి ఎవరో చెప్పారట. అప్పట్నుంచి ఈ సినిమాపై వాకబు చేయడం మొదలుపెట్టాడు సల్మాన్. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత సాజిద్ నడియావాలా సల్మాన్ ను సంప్రదించాడు.
టైమ్ కేటాయిస్తే, మహర్షి స్పెషల్ షోకు ఏర్పాట్లు చేస్తానని, సినిమా చూసిన తర్వాత ఒప్పుకుంటే ఎంత రేటు పెట్టయినా ఆ రీమేక్స్ రైట్స్ దక్కించుకుంటానని సల్మాన్ కు సాజిద్ చెప్పినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు సల్మాన్. ఈ సినిమా రిలీజ్ తర్వాత మహర్షి రీమేక్ పై ఓ నిర్ణయం తీసుకుంటాడు.
Next Story