టైమ్ కథనంపై స్పందించిన మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీపై ‘భారత విచ్ఛిన్నకారి’ అనే శీర్షికతో టైమ్ మ్యాగజైన్‌లో ఒక కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై శుక్రవారం మోడీ స్పందించారు. ‘టైమ్ మ్యాగజైన్ ఒక విదేశీ పత్రిక.. అంతే కాకుండా ఆ కథనం రాసిన వ్యక్తి పాకిస్తాన్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని కూడా చెప్పుకున్నాడు.. ఇది చాలు ఆయన విశ్వసనీయత ఏంటో.. ఆ కథనంలో నిజాలేమిటో’ అని వ్యాఖ్యానించారు. గత వారంలో మార్కెట్లోకి వచ్చిన టైమ్ మ్యాగజైన్‌లో ప్రధాని […]
భారత ప్రధాని నరేంద్ర మోడీపై ‘భారత విచ్ఛిన్నకారి’ అనే శీర్షికతో టైమ్ మ్యాగజైన్‌లో ఒక కథనం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనంపై శుక్రవారం మోడీ స్పందించారు. ‘టైమ్ మ్యాగజైన్ ఒక విదేశీ పత్రిక.. అంతే కాకుండా ఆ కథనం రాసిన వ్యక్తి పాకిస్తాన్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని కూడా చెప్పుకున్నాడు.. ఇది చాలు ఆయన విశ్వసనీయత ఏంటో.. ఆ కథనంలో నిజాలేమిటో’ అని వ్యాఖ్యానించారు.
గత వారంలో మార్కెట్లోకి వచ్చిన టైమ్ మ్యాగజైన్‌లో ప్రధాని మోడీ గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ కథనాన్ని ప్రచురించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. మరో ఐదేళ్లు మోడీని భరించగలదా అని కూడా ప్రశ్నించారు. మోడీ హయంలో ఈ దేశం గతంలో కంటే ఎక్కువ విభజనకు గురవుతుందని అభిప్రాయపడ్డారు. యోగీ ఆదిత్యనాథ్‌ను సీఎం చేయడం, సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఎంపీ సీటు ఇవ్వడాన్ని ఆ కథనంలో తీవ్రంగా విమర్శించారు.
అయితే ఆ కథనం బయటకు వచ్చాక దాని రచయిత అయిన అతిష్ తసీర్‌పై తీవ్రమైన విమర్శలు చెలరేగాయి. అతని వికీపీడియా పేజీని కూడా ఇష్టానుసారంగా ఎడిట్ చేశారు. అతనో కాంగ్రెస్ పీఆర్ మేనేజర్ అంటూ బీజేపీ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ఇన్నాళ్లుగా నోరు విప్పని మోడీ తొలి సారిగా ఈ విషయంపై స్పందించారు.