Telugu Global
NEWS

రీ పోలింగును... టీడీపీ ఎందుకు రచ్చ చేస్తోంది?

‘ఇది ప్రజాస్వామ్యమేనా? ఆ పోలింగ్ వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇలాంటివాటిని చూస్తూ కూర్చోవాలా?‘ ఇవి ఏపీ ఎన్నికల ప్రధానాధాకారి ద్వివేది నోటి నుంచి వెలువడిన మాటలు. ఇది అసాధరణమని పేర్కొంటున్నారు రాజకీయ పరిశీలకులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పలు ప్రాంతాలలో జరిగిన పోలింగ్ వీడియోలు చూసిన తరువాత ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు, వైసీపీ, టీడీపీ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే రీపోలింగ్ జరపాలని ఈసీకి సిఫారసు చేశామని స్పష్టం […]

రీ పోలింగును... టీడీపీ ఎందుకు రచ్చ చేస్తోంది?
X

‘ఇది ప్రజాస్వామ్యమేనా? ఆ పోలింగ్ వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఇలాంటివాటిని చూస్తూ కూర్చోవాలా?‘ ఇవి ఏపీ ఎన్నికల ప్రధానాధాకారి ద్వివేది నోటి నుంచి వెలువడిన మాటలు. ఇది అసాధరణమని పేర్కొంటున్నారు రాజకీయ పరిశీలకులు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి పలు ప్రాంతాలలో జరిగిన పోలింగ్ వీడియోలు చూసిన తరువాత ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోలు, వైసీపీ, టీడీపీ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే రీపోలింగ్ జరపాలని ఈసీకి సిఫారసు చేశామని స్పష్టం చేశారు.

ఆయా ప్రాంతాలలో దళితులను ఓట్లు వేయనీయ లేదని, వారి ఓట్లను టీడీపీ నేతలే వేసుకున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో అక్కడ రీపోలింగుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఇప్పుడు టీడీపీ రచ్చ రచ్చ చేస్తోంది. మా ఫిర్యాదులను పట్టించుకోకుండా, వైసీపీ వినతులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారా..? అంటూ మండిపడుతోంది. ఎప్పటిలాగే దీని సంగతేమిటో తేల్చుకుంటాం అంటూ చంద్రబాబు డాంబికాలకు పోతున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

అయితే ఇటు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, అటు ఎన్నికల సంఘం అధికారులు చంద్రబాబు వ్యాఖ్యల మీద దీటుగానే స్పందించడం విశేషం. మరో వైపున తనకు బలం ఉందని అనుకున్న చోట కూడా రీ పోలింగ్ జరిగితే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

దళితులకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఇవ్వకుండా, వారి ఓట్లు కూడా టీడీపీ నేతలే వేసుకోవడం అన్యాయం కాదా? అని నిలదీస్తున్నారు. దీనికి మాత్రం జవాబివ్వకుండా, చంద్రబాబు ఈసీ మీద మండిపడడం భావ్యం కాదంటున్నారు.

సాధారణంగా ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వస్తే దీనికి రాజకీయ కోణం ఉందా అనే దశలోనే అధికారులు ముందుగా
పరిశీలిస్తారు. అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్నాకే ముందుకు సాగుతారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా జరిగింది అదేనని… కానీ చంద్రబాబు మాత్రం దీనిని కావాలని రాజకీయం చేస్తున్నారని అంటున్నారు.

రాష్ట్రంలోని మరో ఐదారు పోలింగ్ కేంద్రాలలో కూడా రీపోలింగుకు ఈసీ ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడం కొస మెరుపు. దీన్ని బట్టి ఏపీలో ఎన్నికలు ఎలా జరిగాయో అర్థం అవుతోందని అంటున్నారు పరిశీలకులు.

First Published:  18 May 2019 4:05 AM IST
Next Story