ప్రపంచకప్ లో టీమిండియా పై భారీ అంచనాలు
జట్టు కూర్పు బాగుందన్న కపిల్ దేవ్ టీమిండియా విజేతగా తిరిగి రావాలన్న అజరుద్దీన్ రెండోడౌన్లో రాహులే బెటరన్న వెంగ్ సర్కార్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈనెల 30న ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా కూర్పు చాలా బాగుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కితాబిచ్చాడు. విరాట్ కొహ్లీ నాయకత్వంలో సిద్ధం చేసిన 15 మంది సభ్యుల భారతజట్టు…. యువత, అనుభవజ్ఞుల మేళవింపుగా ఉందని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సమతూకం కనిపిస్తోందని కపిల్ చెప్పాడు. […]
- జట్టు కూర్పు బాగుందన్న కపిల్ దేవ్
- టీమిండియా విజేతగా తిరిగి రావాలన్న అజరుద్దీన్
- రెండోడౌన్లో రాహులే బెటరన్న వెంగ్ సర్కార్
ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఈనెల 30న ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా కూర్పు చాలా బాగుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కితాబిచ్చాడు.
విరాట్ కొహ్లీ నాయకత్వంలో సిద్ధం చేసిన 15 మంది సభ్యుల భారతజట్టు…. యువత, అనుభవజ్ఞుల మేళవింపుగా ఉందని, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సమతూకం కనిపిస్తోందని కపిల్ చెప్పాడు.
ఆతిథ్య ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో పాటు టీమిండియా సైతం సెమీస్ చేరడం ఖాయమని కపిల్ జోస్యం చెప్పాడు. 1983 ప్రపంచకప్ నాటిరోజులతో పోల్చి చూస్తే..ప్రస్తుత క్రికెట్ అనూహ్యంగా మారిపోయిందని, ఓపెనింగ్ జోడీ గట్టిగా ఉంటే నాలుగో నంబర్ స్థానంలో ఎవరైనా బ్యాటింగ్ కు దిగవచ్చునని కపిల్ అభిప్రాయపడ్డారు.
జట్టులోని యువఆటగాళ్లను తమ సహజసిద్ధమైన శైలిలో ఆడేలా ప్రోత్సహించాలని కపిల్ కోరాడు. ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాలో అసాధారణ నైపుణ్యం ఉందని కపిల్ కొనియాడాడు.
కొహ్లీ, ధోనీ ఇద్దరూ ఇద్దరే….
ప్రపంచకప్ కు సిద్ధం చేసిన భారతజట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ప్రతిభావంతులైన స్పిన్నర్లు ఉన్నారని..ఇక కెప్టెన్ విరాట్ కొహ్లీ, మాజీ కెప్టెన్ ధోనీ గురించి చెప్పాల్సిన పనే లేదని.. ఇద్దరూ ఇద్దరేనంటూ కపిల్ ప్రశంసల వర్షం కురిపించారు.
రెండోడౌన్లో రాహులే బెటర్…
రెండోడౌన్ స్థానంలో ఎవరిని దించాలన్న ప్రశ్నకు…రాహుల్ ను మించిన ప్రత్యామ్నాయం లేదని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ చెప్పాడు.
అంబటి రాయుడు తుదిజట్టులో చోటు సంపాదించలేకపోడంతో…నాలుగో నంబర్ స్థానంలో ఆటగాడు ఎవరన్న ప్రశ్న తలెత్తింది. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను రెండో నంబర్ స్థానం కోసం ఎంపిక చేసినట్లు చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ ప్రకటించినా ఇంకా ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే… బ్యాటింగ్ ఆర్డర్ కే కీలకమైన రెండోడౌన్ స్థానంలో ఆడటానికి అవసరమైన టెక్నిక్ రాహుల్ కు ఉందని, ప్రస్తుత ప్రపంచకప్ లో రాహుల్ ను మాత్రమే ఆ స్థానంలో దించాలని వెంగ్ సర్కార్ సూచించారు.
అజార్ ఆత్మవిశ్వాసం….
ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్ లో భారత్ విజేతగా నిలవడం ఖాయమని, భారత్ విజేతగా నిలవకపోతే అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ అభిప్రాయపడ్డాడు.
ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్ లో ఆడగల అనుభవం భారత జట్టుకు ఉందని …అక్కడి పిచ్ లు మన బౌలర్లకు అనువుగా ఉంటాయని చెప్పాడు.