Telugu Global
Cinema & Entertainment

ఈ 'సీత'ను భరించగలమా?

రానురాను తెలుగులో సినిమాల నిడివి పెరిగిపోతోంది. కొందరు దీన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటే, మరికొందరు క్రియేటివిటీ అనుకుంటున్నారు. రెండున్నర గంటల్లో సినిమాను చెప్పడం చేతకాక, క్రియేటివిటీ, రసానుభూతి అనే ముసుగుల్లో రన్ టైమ్ పెంచేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సీత సినిమా కూడా చేరింది. విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు తాజాగా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ అధికారులు దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ టైమ్ లో ఈ సినిమా నిడివి ఏకంగా 2 గంటల […]

ఈ సీతను భరించగలమా?
X

రానురాను తెలుగులో సినిమాల నిడివి పెరిగిపోతోంది. కొందరు దీన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటే, మరికొందరు క్రియేటివిటీ అనుకుంటున్నారు. రెండున్నర గంటల్లో సినిమాను చెప్పడం చేతకాక, క్రియేటివిటీ, రసానుభూతి అనే ముసుగుల్లో రన్ టైమ్ పెంచేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సీత సినిమా కూడా చేరింది.

విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు తాజాగా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ అధికారులు దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ టైమ్ లో ఈ సినిమా నిడివి ఏకంగా 2 గంటల 41 నిమిషాలు ఉందనే విషయం బయటకొచ్చింది. నిజానికి మూవీ రన్ టైమ్ పెంచడానికి దర్శకుడు తేజ ఒప్పుకోడు. సినిమాను రెండున్నర గంటల్లోనే చూపించాలనుకుంటాడు. కానీ సీత విషయంలో తేజ మారాడు. బలమైన కంటెంట్ కావడంతో సినిమా రన్ టైమ్ పెరిగిందంటున్నాడు.

అర్జున్ రెడ్డి, మహానటి, భరత్ అనే నేను, రంగస్థలం, మహర్షి.. ఇలా చాలా సినిమాలు రెండున్నర గంటల కంటే ఎక్కువ రన్ టైమ్ తో వచ్చాయి. అవన్నీ సక్సెస్ అయ్యాయి కూడా. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను సీత ఫాలో అవుతోందని అనుకోవాలి. కానీ ఇలా రన్ టైమ్ పెంచడం ప్రేక్షకుడి సమయాన్ని వృధా చేయడమే అవుతుంది.

ఓవైపు 2 గంటల్లోనే సినిమాను ముగించేయాలంటూ ఈతరం కోరుకుంటుంటే, మరోవైపు ఇలా నిడివిని పెంచుకుంటూ పోతోంది టాలీవుడ్. దీనికి ఎప్పుడు, ఎవరు చెక్ పెడతారో చూడాలి.

https://www.facebook.com/BellamkondaSreenivas/photos/a.333060180128152/1799135886853900/?type=3&permPage=1

First Published:  17 May 2019 5:30 AM IST
Next Story