అడ్డంగా దొరికిన సబ్బం హరి
సబ్బం హరి.. వైఎస్ హయాంలో అనకాపల్లి ఎంపీగా సేవలందించారు. ఆ తరువాత జగన్ వెంట నిలిచాడు. తరువాత ఏమైందో తెలియదుగానీ వైసీపీ నుంచి విడిపోయి…. ఆ పార్టీకి, జగన్ కు బద్దశత్రువుగా మారాడు. ఏ పార్టీలో చేరకుండా చంద్రబాబుకు అనుకూలంగా తీవ్రంగా శ్రమించాడు. 2019 ఎన్నికల ముందర వరకు చంద్రబాబును భుజాలపై మోశాడు. అయితే చివరి నిమిషం వరకు ఆయనకూ టిక్కెట్ రాకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందాడు. అయితే చివరి నిమిషంలో భీమిలి అసెంబ్లీ టికెట్ ను […]
సబ్బం హరి.. వైఎస్ హయాంలో అనకాపల్లి ఎంపీగా సేవలందించారు. ఆ తరువాత జగన్ వెంట నిలిచాడు. తరువాత ఏమైందో తెలియదుగానీ వైసీపీ నుంచి విడిపోయి…. ఆ పార్టీకి, జగన్ కు బద్దశత్రువుగా మారాడు. ఏ పార్టీలో చేరకుండా చంద్రబాబుకు అనుకూలంగా తీవ్రంగా శ్రమించాడు.
2019 ఎన్నికల ముందర వరకు చంద్రబాబును భుజాలపై మోశాడు. అయితే చివరి నిమిషం వరకు ఆయనకూ టిక్కెట్ రాకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందాడు. అయితే చివరి నిమిషంలో భీమిలి అసెంబ్లీ టికెట్ ను దక్కించుకొని పోటీచేశారు.
టీడీపీ తరుఫున లాస్ట్ మినిట్ లో అభ్యర్థిగా నిలబడ్డారు.
అయితే ఆయన గెలవడం కోసం చేసిన పనికి ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను గంపగుత్తగా పొందేందుకు సబ్బం హరి ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎర వేయడం బయటపడింది.
ఓ తహసీల్దార్ ను మచ్చిక చేసుకొని ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ నంబర్లు అన్ని సేకరించి 500 మంది ఉద్యోగులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సబ్బం హరి ప్రలోభ పెట్టారు. ఈ ఆడియోలు లీక్ కావడం.. మీడియాలో వరుస కథనాలు రావడంతో టీడీపీ అభాసుపాలైంది.
సబ్బం హరికి సహకరించి ఆయనకు జాబితాను అందించిన తహసీల్దార్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించాడు.
తహసీల్దార్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల డేటా లీక్ అయినట్టు నిర్ధారణ అయ్యింది. తహసీల్దార్ సస్పెన్షన్ కు సిఫార్సు చేసినట్టు తెలిసింది.
మొత్తంగా ఈసీ కఠిన చర్యలు తీసుకుంటే మాత్రం సబ్బం హరి భీమిలిలో గెలిచినా అనర్హత వేటు లేదా రీపోలింగ్ కు అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే సబ్బం హరికే కాదు టీడీపీకి పెద్ద మైనస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.