Telugu Global
NEWS

చంద్రబాబులో కౌంటింగ్ దడ

ఓట్ల లెక్కింపునకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. వివిధ పార్టీలు తమ పార్టీ శ్రేణులకు కౌంటింగ్ మీద తగిన శిక్షణ ఇస్తున్నాయి. టీడీపీ, వైసీపీలు కూడా తమ కౌంటింగ్ ఏజెంట్ల కోసం శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు విజయం మీద మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన చంద్రబాబుకు దడ మొదలైందని అంటున్నారు. అందుకు కారణం తాము గెలిచే స్థితిలో లేమని ఆయనకు […]

చంద్రబాబులో కౌంటింగ్ దడ
X

ఓట్ల లెక్కింపునకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. వివిధ పార్టీలు తమ పార్టీ శ్రేణులకు కౌంటింగ్ మీద తగిన శిక్షణ ఇస్తున్నాయి.

టీడీపీ, వైసీపీలు కూడా తమ కౌంటింగ్ ఏజెంట్ల కోసం శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు విజయం మీద మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన చంద్రబాబుకు దడ మొదలైందని అంటున్నారు. అందుకు కారణం తాము గెలిచే స్థితిలో లేమని ఆయనకు స్పష్టమైన సంకేతాలు అందడమే.

తాజాగా చంద్రబాబు తనకు అత్యంత నమ్మకమైన ఇంటలిజెన్స్ అధికారులతో ఒక సర్వే చేయించారట. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఓటు వేసి ఉంటారనే అంశం మీద ఆరా తీశారట. ముఖ్యంగా మహిళల మనోగతం తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు.

అయితే అధికారులు ఇచ్చిన సర్వే నివేదిక చూశాక చంద్రబాబు కంగు తిన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. టీడీపీకి గెలుపు అవకాశాలు అంతగా లేవని, జనాభిప్రాయం జగన్ వైపే ఉందని సర్వే రిపోర్టు తేల్చి చెప్పడంతో ఆయనకు నోట మాట రాలేదని సమాచారం.

అయితే ఆ తరువాత తేరుకున్న చంద్రబాబు నివేదికను తేలికగా తీసిపడేసి, “మీరు సరిగా సర్వే చేయలేదు.. నాకు తెలిసి ప్రజలు టీడీపీకి అనుకూలంగానే ఓటు వేశారు…. మనమే గెలుస్తాం….” అంటూ వ్యాఖ్యానించారని చెబుతున్నారు.

దీంతో అక్కడే ఉన్న కొందరు టీడీపీ సీనియర్ నేతలు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా బయటకు వచ్చారట. అధినేత చెబుతున్నది వాస్తవమే అయితే, టీడీపీ తిరిగి అధికారంలోకి రాగలిగితే మంచిదే…. కానీ, అలా జరిగే అవకాశాలు ఉన్నాయా ? అంటూ ఆయా నేతలు తమ సన్నిహితుల వద్ద సందేహాలు వ్యక్తం చేశారట.

ఇది ఇలా ఉంటే చంద్రగిరి నియోజక వర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడం కూడా చంద్రబాబుకు మింగుడు పడడం లేదని అంటున్నారు.

నిజానికి అక్కడ అక్రమాలు జరిగాయని నిర్ధారించుకున్నాకే ఈసీ రీపోలింగ్ కు ఆదేశించిందని చెబుతున్నారు. దీనిని హుందాగా స్వీకరించకుండా, దీనినీ వ్యతిరేకిస్తూ ఈసీ కి లేఖ రాస్తానని హుంకరించడం చంద్రబాబుకు సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

First Published:  17 May 2019 2:30 PM IST
Next Story