బాబు కాంగ్రెస్ వైపా? బీజేపీ వైపా?.... రహస్య సమావేశాల తరువాత గానీ తెలియదు
ఎగ్జిట్ పోల్స్ రాలేదు. ఇంకా తుది దశ పోలింగ్ ముగియలేదు. కానీ చంద్రబాబు అధికారం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఏపీలో గెలిచేది కష్టమే అని తేలింది. దీంతో కేంద్రంలో నైనా పదవులు కొట్టేయాలనే ప్లాన్‌లో చంద్రబాబు పడ్డారు. ఇటీవలే రాజగురువు రామోజీరావును కలిసిన చంద్రబాబు…శుక్రవారం హడావుడిగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. షెడ్యూల్‌లో లేనప్పటికి హడావుడిగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చంద్రగిరి రీపోలింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేయడానికి వెళుతున్నారని పైకి చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల […]
ఎగ్జిట్ పోల్స్ రాలేదు. ఇంకా తుది దశ పోలింగ్ ముగియలేదు. కానీ చంద్రబాబు అధికారం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఏపీలో గెలిచేది కష్టమే అని తేలింది. దీంతో కేంద్రంలో నైనా పదవులు కొట్టేయాలనే ప్లాన్‌లో చంద్రబాబు పడ్డారు.
ఇటీవలే రాజగురువు రామోజీరావును కలిసిన చంద్రబాబు…శుక్రవారం హడావుడిగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. షెడ్యూల్‌లో లేనప్పటికి హడావుడిగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చంద్రగిరి రీపోలింగ్‌పై ఈసీకి ఫిర్యాదు చేయడానికి వెళుతున్నారని పైకి చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల భేటీ, కూటమి ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ లోపల మాత్రం వేరే మ్యాటర్ ఉందని తెలుస్తోంది.
రాజకీయంలో వరుస సమావేశాలను చూస్తే మనకు కొన్ని అర్ధమవుతాయి. చెన్నై వెళ్లి కేసీఆర్ స్టాలిన్‌ను కలిశారు. ఆ తర్వాత డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్ అమరావతి వచ్చారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. వెంటనే చంద్రబాబు రాజగురువు రామోజీని ఫిల్మ్‌సిటీలో కలిశారు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీకి సడెన్‌గా ప్రయాణం పెట్టుకున్నారు. అంటే ఏదో రాజకీయ ఎత్తుగడలు నడుస్తున్నాయి.
రాజగురువుతో ఏం చర్చించారు? ఆయన ఏం సలహా ఇచ్చారు? అనేది ఇప్పటికప్పుడు తెలియదు. కానీ ఈ వరుస సంఘటనలతో మాత్రం ఏదో జరుగుతుంది అని మాత్రం తెలుస్తోంది. చంద్రబాబు మరో యూ టర్న్ తీసుకుంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది. బీజేపీతో విడిపోకుండా ఉండాల్సింది అని రాజగురువు ఇప్పటికే అన్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ మోదీతో దోస్తీ కోసమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనేది టీడీపీ అంచనాగా తెలుస్తోంది. దీంతో కేంద్రంలో అధికారం పంచుకోవాలని చంద్రబాబు తాజా ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం ఈసీని ఇతర నేతలను కలిసే చంద్రబాబు… అర్ధరాత్రి చీకటి సమావేశాలలో ఎవరిని కలుస్తారనేది చూడాలి. ఆ కలయికలను బట్టి చంద్రబాబు ఏ టర్న్ తీసుకోబోతున్నారో తెలుస్తుంది.