Telugu Global
Cinema & Entertainment

కే.జీ.ఎఫ్ సెకండ్ పార్ట్ లో.... రావు రమేష్

తెలుగు సినిమా పరశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు రావు రమేష్.  ఇటీవల కాలంలో ఆయన దాదాపుగా అన్ని పెద్ద సినిమాల లో నటించి అందరి మెప్పును పొందారు. అప్పుడప్పుడు ఇతర భాషలలో కూడా నటిస్తూ తన దైన ముద్రను ఇతర భాష అభిమానులకి కూడా పంచుతుండడం రావు రమేష్ స్పెషాలిటీ. తాజా గా వస్తున్న వార్తల ప్రకారం రావు రమేష్ త్వరలో కన్నడ పరిశ్రమలోని పెద్ద ప్రాజెక్టులో పని చేయనున్నట్లు తెలుస్తుంది. […]

కే.జీ.ఎఫ్ సెకండ్ పార్ట్ లో.... రావు రమేష్
X

తెలుగు సినిమా పరశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు రావు రమేష్.

ఇటీవల కాలంలో ఆయన దాదాపుగా అన్ని పెద్ద సినిమాల లో నటించి అందరి మెప్పును పొందారు. అప్పుడప్పుడు ఇతర భాషలలో కూడా నటిస్తూ తన దైన ముద్రను ఇతర భాష అభిమానులకి కూడా పంచుతుండడం రావు రమేష్ స్పెషాలిటీ.

తాజా గా వస్తున్న వార్తల ప్రకారం రావు రమేష్ త్వరలో కన్నడ పరిశ్రమలోని పెద్ద ప్రాజెక్టులో పని చేయనున్నట్లు తెలుస్తుంది. రావు రమేష్ కే.జీ.ఎఫ్ సెకండ్ పార్ట్ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

కే.జీ.ఎఫ్ మొదటి భాగం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలయి పెద్ద విజయం సాధించిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో భాగం పై ఎనలేని అంచనాలు ప్రస్తుతం వున్నాయి. వీటిని అందుకునే క్రమంలో చిత్ర యూనిట్ చాలా కష్ట పడుతున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పార్ట్ షూటింగ్ సెప్టెబర్ లోపు పూర్తి కానున్నది. అయితే రావు రమేష్ ఈ సినిమా లో ఏ పాత్ర పోషిస్తున్నాడు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

ఆగస్ట్ నెల నుండి ప్రారంభం అయ్యే కొత్త షెడ్యూల్లో రావు రమేష్ పాల్గొంటునట్టు తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కి దర్శకుడిగా చేస్తున్నాడు. ఈ సినిమా లో కొంత మంది హిందీ నటులు కూడా పాల్గొంటారని తెలుస్తుంది.

First Published:  16 May 2019 1:16 PM IST
Next Story