కేసీఆర్ కు, జగన్ కు తేడా అదే
కేసీఆర్ ఎన్ని గొప్ప పథకాలు ప్రవేశపెట్టినా…. ప్రజలందరికీ అన్ని సమకూర్చిపెట్టినా ఒక్క విమర్శ మాత్రం ఆయనపై ఎప్పటికీ ఉండిపోయింది. అదే ప్రజలను నేరుగా కలుసుకోకపోవడం.. వారి సమస్యలు తెలుసుకోకపోవడం. ఉమ్మడి ఏపీలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను నేరుగా కలుసుకునేవారు.. ప్రజాదర్భార్ నిర్వహించేవారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక రచ్చబండ ప్రోగ్రాం పెట్టి ప్రజలను నేరుగా కలిసేందుకు తిరుపతి వెళ్తుండగా హెలీకాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎప్పుడూ జనం […]
కేసీఆర్ ఎన్ని గొప్ప పథకాలు ప్రవేశపెట్టినా…. ప్రజలందరికీ అన్ని సమకూర్చిపెట్టినా ఒక్క విమర్శ మాత్రం ఆయనపై ఎప్పటికీ ఉండిపోయింది. అదే ప్రజలను నేరుగా కలుసుకోకపోవడం.. వారి సమస్యలు తెలుసుకోకపోవడం.
ఉమ్మడి ఏపీలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలను నేరుగా కలుసుకునేవారు.. ప్రజాదర్భార్ నిర్వహించేవారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక రచ్చబండ ప్రోగ్రాం పెట్టి ప్రజలను నేరుగా కలిసేందుకు తిరుపతి వెళ్తుండగా హెలీకాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.
ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎప్పుడూ జనం మధ్యే ఉంటారు. అధికారంలోకి రాకముందే మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తన సొంత జిల్లా కడపలోని పులివెందుల నియోజకవర్గంలో ప్రజాదర్భార్ నిర్వహించారు.
ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గురువారం కూడా కడప జిల్లాలోనే వైఎస్ జగన్ పర్యటించనున్నారు. 17న హైదరాబాద్ వస్తారు. ప్రజాదర్భార్ ద్వారా ప్రజలతో మమేకం కావడానికి వారి కష్టాలు తెలుసుకోవడానికి జగన్ సమయం కేటాయించారు.
జగన్ చేసిన పని సీఎంగా రెండు సార్లు ఎన్నికైనా కేసీఆర్ చేయకపోవడం గమనార్హం. కేసీఆర్ ఎంత చేసినా.. దేశవ్యాప్తంగా ఆయన పథకాలు మారుమోగుతున్నా.. ప్రజలకు నేరుగా చేరువ అవ్వడంలో ఆయన విఫలమవుతూనే ఉన్నాడు.
ఇప్పటికీ ప్రగతి భవన్ లోకి సామాన్యుల ప్రవేశమే కాదు… మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈజీగా వెళ్ళలేరు. పెద్ద పెద్ద నాయకులకే కేసీఆర్ దర్శనభాగ్యం కలుగదు.. ఇక సామాన్యుల ప్రవేశం కుదురుతుందా.. ఇలా ప్రజలను దగ్గరనుంచి చూసి వారి సమస్యలు పరిష్కరించే విషయంలో కేసీఆర్ అందరు సీఎంల కంటే వెనుకే అనడంలో ఎలాంటి సందేహం లేదు.