Telugu Global
NEWS

ఐపీఎల్ తో బీసీసీఐ, ఫ్రాంచైజీలకు డబ్బే డబ్బు

అభిమానులకు వినోదం..క్రికెటర్లకు ఆదాయం 43వేల కోట్ల రూపాయలకు చేరిన ఐపీఎల్ బ్రాండ్ విలువ ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ 6వేల 955 కోట్లు ప్రపంచ క్రికెట్లోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుకు….ఐపీఎల్ ప్రధాన ఆదాయవనరుగా మారింది. బీసీసీఐ సకలజన ప్రధాన ఆదాయవనరుగా నిలిచింది. చివరకు భారత ప్రభుత్వానికి…. అధికమొత్తంలో పన్ను రాబడిగా కూడా నిలిచింది. బీసీసీఐ బంగారు బాతు…. ఐపీఎల్ రెవెన్యూపై…… స్పెషల్ స్టోరీ…….. భారత గడ్డపై ఏటా…. ఏడువారాలపాటు జరిగే ఐపీఎల్ అంటే…. దేశ విదేశాలలోని […]

ఐపీఎల్ తో బీసీసీఐ, ఫ్రాంచైజీలకు డబ్బే డబ్బు
X
  • అభిమానులకు వినోదం..క్రికెటర్లకు ఆదాయం
  • 43వేల కోట్ల రూపాయలకు చేరిన ఐపీఎల్ బ్రాండ్ విలువ
  • ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ 6వేల 955 కోట్లు

ప్రపంచ క్రికెట్లోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డుకు….ఐపీఎల్ ప్రధాన ఆదాయవనరుగా మారింది. బీసీసీఐ సకలజన ప్రధాన ఆదాయవనరుగా నిలిచింది. చివరకు భారత ప్రభుత్వానికి…. అధికమొత్తంలో పన్ను రాబడిగా కూడా నిలిచింది. బీసీసీఐ బంగారు బాతు…. ఐపీఎల్ రెవెన్యూపై…… స్పెషల్ స్టోరీ……..

భారత గడ్డపై ఏటా…. ఏడువారాలపాటు జరిగే ఐపీఎల్ అంటే…. దేశ విదేశాలలోని కోట్లాదిమంది అభిమానులకు…. సిక్సర్లు, బౌండ్రీలు, సెంచరీలు, క్యాచ్ లు, రికార్డులు.

అదే నిర్వాహక బీసీసీఐకి…., ముంబై, కోల్ కతా , చెన్నై లాంటి ఫ్రాంచైజీలకు, స్వదేశీ, విదేశీ క్రికెటర్లు, నిర్వాహక సంఘాలు, అంపైర్లు, సెలెక్టర్లు, మాజీ క్రికెటర్లకు మాత్రం…ఐపీఎల్ అంటే వివిధ రూపాలలో డబ్బే డబ్బు.

చివరకు… భారత ప్రభుత్వానికి సైతం…ఏటా పన్నుల రూపంలో నిలకడగా ఆదాయం అందించే వనరు. ఇలా ….బీసీసీఐతో అనుబంధం ఉన్న సకలజనులపాలిట బంగారు బాతు.

2008 సీజన్లో ప్రారంభమై…ఆ తర్వాతి దశాబ్దకాలంలో అంతై…ఇంతై…అంతింతై అన్నట్లుగా ఎదిగిపోయిన ఐపీఎల్ ..బ్రాండ్ విలువ 43వేల కోట్ల రూపాయలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు…గత పుష్కర కాలంలో కొహ్లీ, ధోనీ,వాట్సన్ లాంటి అంతర్జాతీయ క్రికెటర్ల ఐపీఎల్ ఆదాయం వందకోట్ల మార్కు చేరితే… చోటామోటా దేశవాళీ క్రికెటర్లు సైతం కోటీశ్వరులుగా మారిపోయారు.

బీసీసీఐకి డబ్బే డబ్బు…

ఇక…బీసీసీఐ….మరింత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా అవతరించింది. వచ్చే ఐదేళ్ల కాలానికి ఐపీఎల్ ప్రసారహక్కుల విక్రయంతో బీసీసీఐ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఐపీఎల్ పుణ్యమా అంటూ బీసీసీఐ మిగులు ఆదాయం 16 రెట్లకు చేరింది.

ఐపీఎల్ తో భారీ మిగులు….

రంజీట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీలతో బీసీసీఐకు వస్తున్న ఆదాయం మిగులు 125 కోట్ల రూపాయలైతే…కేవలం ఐపీఎల్ ద్వారా…2వేల 17 కోట్ల రూపాయల మిగులు ఆదాయం వస్తోంది.

ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి మొత్తం 3 వేల 413 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే…వార్షిక ఖర్చు మాత్రం 1, 273 కోట్ల రూపాయలు మాత్రమే.

ఈ ఖర్చులో క్రికెట్ మౌలిక సదుపాయాల కల్పన, ఇండియా-ఏ, మహిళా క్రికెట్, జూనియర్ క్రికెట్ టోర్నీల నిర్వహణ, జాతీయ క్రికెట్ అకాడమీ ఖర్చులు సైతం ఉన్నాయి.

2017 సీజన్లో బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా 400 కోట్ల రూపాయల మిగులు ఆదాయం దక్కింది. 2018 సీజన్లో ఈ మొత్తం 670 కోట్ల రూపాయలుగా ఉంది. 2019 సీజన్లో ఆదాయం 700 కోట్ల రూపాయలకు చేరింది.

ఐపీఎల్ లో బ్రాండ్ బాజా….

ప్రపంచ క్రికెట్లోనే అత్యంత భాగ్యవంతమైన టీ-20 క్రికెట్ లీగ్ గా…ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. బీసీసీఐ 11 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఐపీఎల్… అంతైఇంతై అంతింతై అన్నట్లుగా పెరిగిపోయింది.

అంతర్జాతీయ బ్రాండింగ్ తాజా అంచనాల ప్రకారం…. ఐపీఎల్ బ్రాండ్ విలువ ఏకంగా 43వేల కోట్ల రూపాయలకు చేరింది. 2017-18 సీజన్ ఒక్క ఏడాదిలోనే బ్రాండ్ వాల్యూ… అనూహ్యంగా 7వేల కోట్ల రూపాయల మేర పెరిగింది.

మరోవైపు… ఐపీఎల్ లో నాలుగుసార్లు విజేత ముంబై ఫ్రాంచైజీ విలువ 6వేల 955 కోట్లకు చేరింది. ఆ తర్వాతి స్థానంలో కోల్ కతా ఫ్రాంచైజీ నిలిచింది. కోల్ కతా నైట్ రైడర్స్ బ్రాండ్ విలువను 6 వేల 867 కోట్ల రూపాయలుగా తేల్చారు.

ప్రసారహక్కుల ఆదాయంలో రికార్డు…

ఐపీఎల్ ప్రసారహక్కులను సోనీ ఎంటర్ టెయిన్ మెంట్ నుంచి స్టార్ గ్రూప్ దక్కించుకోడంతోనే పరిస్థితి అనూహ్యంగా మారిపోయింది.

ఐపీఎల్ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాలను ఇంగ్లీష్, హిందీ భాషలకే పరిమితం కాకుండా దేశంలోని మరో ఆరు ప్రాంతీయ భాషలకు విస్తరించడం ద్వారా బ్రాండ్ విలువ పెరిగినట్లు ఇటీవల వివిధ సంస్థలు నిర్ణయించిన తాజా అధ్యయనంలో తేలింది.

స్టార్ ఇండియాకు కాసుల గలగల ప్రస్తుత 2019 సీజన్లో ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా…ప్రచార ప్రకటనలు, యాడ్ల ద్వారా… రికార్డు స్థాయిలో 2200 కోట్ల రూపాయలు ఆర్జించింది.

ప్రపంచ క్రీడారంగంలోనే అత్యంత ఖరీదైన లీగ్ లలో ఒకటిగా ఐపీఎల్ గుర్తింపు తెచ్చుకోడం వెనుక బీసీసీఐ కృషి ఎంతో ఉంది.

First Published:  15 May 2019 9:40 PM GMT
Next Story