'మహర్షి' లో రైతు.... బయట ఇలా....
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమా మంచి వసూళ్ళనే రాబడుతోంది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో భారీ కలెక్షన్స్ వసూళ్లు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మిగతా నటీనటులతో పాటు సినిమాలో చిన్న పాత్ర పోషించిన గురుస్వామి నటన సినిమాకి హై లైట్ అయింది. రైతు పాత్రలో గురు స్వామి నటన, రైతుల గురించి చెప్పిన డైలాగులు, ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ఈ నేపథ్యంలో అసలు […]
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రం గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమా మంచి వసూళ్ళనే రాబడుతోంది. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో భారీ కలెక్షన్స్ వసూళ్లు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మిగతా నటీనటులతో పాటు సినిమాలో చిన్న పాత్ర పోషించిన గురుస్వామి నటన సినిమాకి హై లైట్ అయింది. రైతు పాత్రలో గురు స్వామి నటన, రైతుల గురించి చెప్పిన డైలాగులు, ప్రేక్షకులను బాగా మెప్పించాయి.
ఈ నేపథ్యంలో అసలు గురుస్వామి నిజంగానే రైతు అయ్యి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ గురుస్వామి నిజానికి రైతు కాదు. కర్నూల్ కి చెందిన ఆయన బీఎస్ ఎన్ లో ఉద్యోగం చేసి 2003 లో పదవి విరమణ చేశారు.
ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల….. నాటకాలు వేయడం మొదలు పెట్టాడు. 1960వ సంవత్సరంలో మొదటి సారి ‘నేటి విద్యార్థి’ అనే నాటకం వేసిన గురుస్వామి ఉద్యోగిగా కూడా పలు నాటకాలు వేశారు.
పదవి విరమణ తర్వాత గురుస్వామి నాటకాలు కొనసాగించడంతో పాటు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా చేశారు. ‘ఆయుష్మాన్ భవ’ అనే షార్ట్ ఫిల్మ్ తో దిల్ రాజు ఆఫీస్ కు చేరుకుని అసిస్టెంట్ డైరెక్టర్ కి చూపించగా ఆయన కో డైరెక్టర్ రాంబాబుకు చెప్పారు.
ఆడిషన్స్ కు రమ్మని గురుస్వామికి రాంబాబు పిలిచి రైతు కాస్ట్యూమ్స్ వేసి దిల్ రాజు, వంశీ, మహేష్ బాబు కి చూపించి తరువాత సినిమాలో ఛాన్స్ ఇచ్చారట. 25 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొని తన పాత్రను పూర్తి చేశాడు గురు స్వామి.