అప్పుడు 'దడ' పుట్టించారు... ఇప్పుడు ఏం చేస్తారో?
వరుసగా డిజాస్టర్ లతో మార్కెట్ బాగా పడిపోయిన అక్కినేని హీరో నాగ చైతన్య తాజాగా ‘మజిలీ’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘వెంకీ మామ’ అనే సినిమా లో తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. తరువాత నాగ చైతన్య అగ్ర నిర్మాత దిల్ రాజు తో మరో సినిమా చేయబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రాజు దిల్ […]

వరుసగా డిజాస్టర్ లతో మార్కెట్ బాగా పడిపోయిన అక్కినేని హీరో నాగ చైతన్య తాజాగా ‘మజిలీ’ అనే సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘వెంకీ మామ’ అనే సినిమా లో తన మేనమామ విక్టరీ వెంకటేష్ తో కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. తరువాత నాగ చైతన్య అగ్ర నిర్మాత దిల్ రాజు తో మరో సినిమా చేయబోతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రాజు దిల్ రాజు ఒక కొత్త దర్శకుడిని రంగంలోకి దింపాలని చూస్తున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనులు ఇప్పటికే దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ విషయమై ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నటించేందుకు కాజల్ అగర్వాల్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్ర హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ త్వరలో ‘సీత’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇక అన్నీ కుదిరితే ఈమె త్వరలో నాగచైతన్యతో రొమాన్స్ చేయబోతోందన్న మాట. నిజానికి 2011లో నాగ చైతన్య, కాజల్ కలిసి ‘దడ’ అనే సినిమాలో నటించారు కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. మరి వీరిద్దరి కాంబో ఈసారైనా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.