ఏపీ ఫలితాలపై కేసీఆర్‌తో విభేదించిన స్టాలిన్
ప్రతీది లెక్కలేసుకొని.. సర్వేలు తెప్పించుకొని పక్కాగా అమలు చేసే కేసీఆర్ తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై జోస్యం చెప్పారు. ఏకంగా డీఎంకే అధినేత స్టాలిన్ కు ఆ నివేదిక అందజేశాడట. ఇంటెలిజెన్స్ సహా వివిధ సర్వేల ద్వారా తెప్పించుకున్న పక్కా సమాచారాన్ని స్టాలిన్ కు కేసీఆర్ అందజేయగా ఆయన అవాక్కైనట్టు తెలిసింది. ఏపీలో ఈసారి జగన్ అధికారంలోకి వస్తాడని.. 20 లోక్ సభ సీట్లు ఖచ్చితంగా గెలుస్తాడని స్టాలిన్ వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది. కనీసం 120 […]
ప్రతీది లెక్కలేసుకొని.. సర్వేలు తెప్పించుకొని పక్కాగా అమలు చేసే కేసీఆర్ తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై జోస్యం చెప్పారు. ఏకంగా డీఎంకే అధినేత స్టాలిన్ కు ఆ నివేదిక అందజేశాడట. ఇంటెలిజెన్స్ సహా వివిధ సర్వేల ద్వారా తెప్పించుకున్న పక్కా సమాచారాన్ని స్టాలిన్ కు కేసీఆర్ అందజేయగా ఆయన అవాక్కైనట్టు తెలిసింది.
ఏపీలో ఈసారి జగన్ అధికారంలోకి వస్తాడని.. 20 లోక్ సభ సీట్లు ఖచ్చితంగా గెలుస్తాడని స్టాలిన్ వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్టు తెలిసింది. కనీసం 120 సీట్లతో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడని వివరించాడట. అయితే తన మిత్రుడైన చంద్రబాబు ఓడిపోతాడని కేసీఆర్ చెప్పిన దానికి స్టాలిన్ విభేదించాట.
ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని…. జగన్ 20, టీఆర్ఎస్ 15తోపాటు డీఎంకే, జేడీయూ, కమ్యూనిస్టులు కలిసి వస్తే ఢిల్లీలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్ ప్రతిపాదించారట.. కానీ బాబు ఓటమి.. 5 సీట్లకే పరిమితమవుతాడనే విషయంపై మాత్రం స్టాలిన్ విభేదించినట్టు తెలిసింది.