Telugu Global
NEWS

ఏపీ క్యాబినెట్ భేటీకి గైర్హాజరైన మంత్రులు

ఏపీ క్యాబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది. ఎన్నికల సంఘంతో పంతానికి పోయి సీఎస్‌ను కూడా విమర్శించి తన పంతాన్ని నెగ్గించుకొని మరీ చంద్రబాబు పెట్టిన ఈ భేటీకి సీనియర్ మంత్రులు దూరంగా ఉండటంతో ఆయన షాక్‌కు గురయ్యారు. మంత్రుల గైర్హాజరీకి కారణాలు తెలుసుకోవడానికి సీఎంవో నుంచి కాల్స్ వెళ్లినా అటువైపు నుంచి స్పందన రానట్లు తెలుస్తోంది. సీనియర్ మంత్రులు పితాని సత్యనారాయణ, సుజయ క్రిష్ణ రంగారావు, అమరనాథరెడ్డి, ఎండీ ఫరూక్, ఆదినారాయణ రెడ్డి, […]

ఏపీ క్యాబినెట్ భేటీకి గైర్హాజరైన మంత్రులు
X

ఏపీ క్యాబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం అమరావతిలోని సచివాలయంలో ప్రారంభమైంది. ఎన్నికల సంఘంతో పంతానికి పోయి సీఎస్‌ను కూడా విమర్శించి తన పంతాన్ని నెగ్గించుకొని మరీ చంద్రబాబు పెట్టిన ఈ భేటీకి సీనియర్ మంత్రులు దూరంగా ఉండటంతో ఆయన షాక్‌కు గురయ్యారు. మంత్రుల గైర్హాజరీకి కారణాలు తెలుసుకోవడానికి సీఎంవో నుంచి కాల్స్ వెళ్లినా అటువైపు నుంచి స్పందన రానట్లు తెలుస్తోంది.

సీనియర్ మంత్రులు పితాని సత్యనారాయణ, సుజయ క్రిష్ణ రంగారావు, అమరనాథరెడ్డి, ఎండీ ఫరూక్, ఆదినారాయణ రెడ్డి, యనమల రామకృష్ణుడు కేబినెట్ భేటీకి దూరంగా ఉన్నారు. వారి గైర్హాజరీకి గల కారణాలు తెలియరాలేదు.

అయితే పలువురు వ్యక్తిగత కారణాల వల్ల, విదేశీ పర్యటనలో ఉండటం వల్ల హాజరు కాలేదని చెబుతున్నారు. మరో 9 రోజుల్లో ప్రభుత్వ గడువు ముగుస్తున్నందు వల్ల ఈ భేటీకి వెళ్లడం అవసరమా అని కొంత మంది ముందుగానే వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, క్యాబినెట్ సమావేశానికి ముందు చంద్రబాబు మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఈ భేటీలో కరవు, ఫొని తుపాను ప్రభావం, తాగునీటి ఎద్దడితో పాటు వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే తమ అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

First Published:  14 May 2019 10:30 AM IST
Next Story