Telugu Global
NEWS

బడాయి....బాబుకు కులం....మతం లేదట !

నారా చంద్రబాబు నాయుడు ఒక్కోసారి బ్రహ్మాండమైన జోకులు పేలుస్తారు. నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ స్థానాలలో పార్టీ పరిస్థితి గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలోనూ దీనిని అయన పునరావృతం చేశారు. ఈ సమావేశంలో తనకు కులం, మతం లేదని అందరూ తనకు సమానమేనని స్పష్టం చేశారు. అందుకే అన్ని వర్గాలవారు టీడీపీకి ఓట్లు వేశారని, ఇక తమ గెలుపు ఖాయమని ముక్తాయించారట. మరి అన్ని అంశాలలోనూ తమ సామాజికవర్గానికి చెందిన వారికే పెద్ద పీట వేయడం […]

బడాయి....బాబుకు కులం....మతం లేదట !
X

నారా చంద్రబాబు నాయుడు ఒక్కోసారి బ్రహ్మాండమైన జోకులు పేలుస్తారు. నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ స్థానాలలో పార్టీ పరిస్థితి గురించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలోనూ దీనిని అయన పునరావృతం చేశారు.

ఈ సమావేశంలో తనకు కులం, మతం లేదని అందరూ తనకు సమానమేనని స్పష్టం చేశారు. అందుకే అన్ని వర్గాలవారు టీడీపీకి ఓట్లు వేశారని, ఇక తమ గెలుపు ఖాయమని ముక్తాయించారట. మరి అన్ని అంశాలలోనూ తమ సామాజికవర్గానికి చెందిన వారికే పెద్ద పీట వేయడం వెనుక మర్మమేమిటని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.

అటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలలోనూ, ఇటు పార్టీ, ప్రభుత్వ పదవులలోనూ తమవారికే అగ్రస్థానం కల్పించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తమ రిజర్వేషన్ల డిమాండ్లను పక్కన పెట్టినందుకే కాపులు దూరమయ్యారని చెబుతున్నారు.

తమ సామాజిక వర్గానికి చెందిన వారికే టికెట్ ఇస్తామని నమ్మించి, చివరికి మొండిచేయి చూపారనే కోపంతోనే మంగళగిరిలో పద్మశాలీలు టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారని అంటున్నారు. ఇక్కడ నుంచి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి కూడా అయిన లోకేశ్ బాబు పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో ఆయన పడరాని పాట్లు పడ్డారని వార్తలు వచ్చాయి. మరి అన్ని వర్గాలు తమకే సానుకూలంగా ఉన్నాయని చంద్రబాబు భావిస్తే లోకేశ్ బాబు అంతగా ఎందుకు కష్ట పడాల్సి వచ్చిందో చెప్పాలంటున్నారు.

మరోవైపు సోమవారం జరిగిన సమీక్షలోనే చంద్రబాబు చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు అశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు. కార్యకర్తలను అదుపులో ఉంచాలనే భావనతోనే ఘర్షణలు, గొడవలకు వారిని దూరంగా ఉండమన్నానని, ఇక ముందు అలా చెప్పనని బాబు అన్నట్టు సమాచారం. దీని అంతరార్థం ఏమిటో కూడా తెలియడం లేదంటున్నారు.

మొత్తానికి బాబు మాటలను నిశితంగా గమనిస్తే ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నారన్న విషయం స్పష్టమవుతోందని అంటున్నారు. ప్రతి ఓటు తమకు ముఖ్యమేనని, కౌంటింగ్ లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని తమ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారట.

క్షణక్షణం గెలుపు మంత్రాన్ని పఠిస్తున్న చంద్రబాబుకు అంత అనుమానం, జాగరూకత ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏమిటో ఆయనకు బోధపడుతున్నట్లుగా ఉందని అంటున్నారు.

First Published:  14 May 2019 3:05 AM IST
Next Story