పవర్ స్టార్ ఇంట్లో పెళ్ళి కి.... మెగా స్టార్ కి ఆహ్వానం
కన్నడ నాట రాజ్ కుమార్ ఎంత పెద్ద నటుడో మన అందరికీ తెలుసు. ఆయన తర్వాత ఆయన నట వారసులు గా శివ రాజ్ కుమార్ మరియు పునీత్ రాజ్ కుమార్ కన్నడ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ వరుస విజయాలు సాధించి పవర్ స్టార్ గా తన ప్రతిభ ని చాటుకున్నాడు. అయితే ఈ కన్నడ పవర్ స్టార్ ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి ని కలిశారు. […]
కన్నడ నాట రాజ్ కుమార్ ఎంత పెద్ద నటుడో మన అందరికీ తెలుసు. ఆయన తర్వాత ఆయన నట వారసులు గా శివ రాజ్ కుమార్ మరియు పునీత్ రాజ్ కుమార్ కన్నడ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ వరుస విజయాలు సాధించి పవర్ స్టార్ గా తన ప్రతిభ ని చాటుకున్నాడు.
అయితే ఈ కన్నడ పవర్ స్టార్ ఇటీవలే మెగా స్టార్ చిరంజీవి ని కలిశారు. చిరంజీవి ని, అలాగే రామ్ చరణ్ ని విడివిడిగా కలిశారు. వీరి కలయిక కి సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య రఘు రాజ్ కుమార్ కుమారుడి వివాహం సందర్భం గా, ఆ వేడుక కి ఆహ్వానించడానికి పునీత్…. చిరు, చరణ్ లని కలిసినట్టు సమాచారం. త్వరలో బెంగళూర్ లో అంగ రంగ వైభవం గా ఈ వేడుక జరగనుంది.
సినిమా పరిశ్రమ లో ని అతిరథ మహారథులు ఈ వేడుకకి కదిలి రానున్నారు. తెలుగు పరిశ్రమ లో మెగా ఫ్యామిలీతో పాటు మరికొందరిని కూడా ఈ వివాహానికి ఆహ్వానించినట్టు సమాచారం.