Telugu Global
NEWS

కేటీఆర్ ఎంట్రీతో మారిన సమీకరణాలు

సీట్ల కేటాయింపుల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిచ్చే కేసీఆర్ ఈసారి మాత్రం దాన్ని అటకెక్కించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు రెడ్లకు టికెట్లు ఇచ్చారు. దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్ లో దుమారం రేగుతోంది. అల్ప సామాజికవర్గాలు దీనిపై గొంతెత్తుతున్నాయి. అయితే నల్లగొండ, రంగారెడ్డిపై ఎవ్వరికీ అభ్యంతరాలు లేవు…. కానీ వరంగల్ ఎమ్మెల్సీ సీటుపైనే వివాదం నెలకొంది. మొన్నటి ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోయారు. గెలిచిన గండ్రా వెంకటరమణారెడ్డి సైతం టీఆర్ఎస్ లో చేరిపోయారు. […]

కేటీఆర్ ఎంట్రీతో మారిన సమీకరణాలు
X

సీట్ల కేటాయింపుల్లో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిచ్చే కేసీఆర్ ఈసారి మాత్రం దాన్ని అటకెక్కించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు రెడ్లకు టికెట్లు ఇచ్చారు. దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్ లో దుమారం రేగుతోంది. అల్ప సామాజికవర్గాలు దీనిపై గొంతెత్తుతున్నాయి. అయితే నల్లగొండ, రంగారెడ్డిపై ఎవ్వరికీ అభ్యంతరాలు లేవు…. కానీ వరంగల్ ఎమ్మెల్సీ సీటుపైనే వివాదం నెలకొంది.

మొన్నటి ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోయారు. గెలిచిన గండ్రా వెంకటరమణారెడ్డి సైతం టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు మధుసూదనాచారికి రాజకీయంగా భవిష్యత్ లేకుండా పోయింది. ఆయన భవిష్యత్ పై టీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో సైలెంట్ గా ఉంటున్నారు.

కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉద్యమకాలం నుంచి అండగా ఉన్న మధుసూదనాచారిని 2014లో ఒప్పించి మరీ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు కేసీఆర్. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో పూర్తిగా పక్కనపెట్టేశారు.

నిజానికి వరంగల్ స్థానిక సంస్థల సీటును మధుసూదనా చారికి ఇవ్వడానికి అంతా రెడీ అయిన వేళ కేటీఆర్ చక్రం తిప్పినట్టు తెలిసింది. కేటీఆర్ క్లాస్ మేట్ అయిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికే టికెట్ ఇప్పించారనే టాక్ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ తోపాటు శ్రీనివాస్ రెడ్డి చదువుకున్నాడు. శ్రీనివాస్ రెడ్డి ఉద్యమకాలం నుంచి పెద్దగా కనిపించకపోయినా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. కేటీఆర్, సంతోష్ స్నేహితుడిగా వరంగల్ లో కేటీఆర్ పర్యటించినప్పుడు అన్నీ తానై వ్యవహరించారు. అందుకే కేటీఆర్ ఒత్తిడి మేరకే కేసీఆర్ మధుసూదనా చారిని పక్కనపెట్టినట్టు సమాచారం.

ఇలా కేటీఆర్ జోక్యంతోనే శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కిందని.. మాజీ స్పీకర్ మధుసూదనా చారికి మొండిచేయి ఎదురైందనే టాక్ టీఆర్ఎస్ లో వినిపిస్తోంది.

First Published:  13 May 2019 6:57 AM IST
Next Story