కేంద్రంలో హంగే.... సీ.ఎస్.ఈ.పీ.ఆర్ సర్వే అంచనా
మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. దేశంలో అధికారం ఈసారి ఎవరిది అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే ఎన్నో అంచనాలు.. ఎన్నో సర్వేలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పోలింగ్ సరళిని గమనించి తమ నివేదికలను పొందుపరుస్తున్నాయి. మే 19న చివరి విడత పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తనున్నాయి. అయితే తాజాగా ఢిల్లీకి చెందిన ‘ఏ స్టీడీ బై ద సెంటర్ ఫర్ సోషియా ఎకనామిక్ అండ్ పొలిటికల్ రీసెర్చ్’ (సీఎస్ఈపీఆర్) అనే సంస్థ 6వ విడత […]
మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. దేశంలో అధికారం ఈసారి ఎవరిది అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే ఎన్నో అంచనాలు.. ఎన్నో సర్వేలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పోలింగ్ సరళిని గమనించి తమ నివేదికలను పొందుపరుస్తున్నాయి. మే 19న చివరి విడత పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తనున్నాయి.
అయితే తాజాగా ఢిల్లీకి చెందిన ‘ఏ స్టీడీ బై ద సెంటర్ ఫర్ సోషియా ఎకనామిక్ అండ్ పొలిటికల్ రీసెర్చ్’ (సీఎస్ఈపీఆర్) అనే సంస్థ 6వ విడత ముగియగానే తన అధ్యయనాన్ని చేసింది. ఇందులో దేశంలో హంగ్ వస్తుందని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు సాగిన ఎన్నికల ఫలితాల ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 234 సీట్లు, యూపీఏకు 169 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు మెజార్టీ సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది. బెంగాల్ లో మమత, యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి మెజార్టీ సీట్లు సాధిస్తాయని తెలిపింది.
అయితే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ కే ఎక్కువ స్కోప్ కనపడుతోంది. బెంగాల్ లో మమత, యూపీలో ఎస్పీ-బీఎస్పీ, డీఎంకే సహా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వెంటే నడుస్తాయని అంటున్నారు. దీంతో ఆ పార్టీకే స్కోప్ ఎక్కువగా ఉందంటున్నారు. టీఆర్ఎస్, వైసీపీలతో కూడా కాంగ్రెస్ మంతనాలు జరుపుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఫలితాల తర్వాత వీరు కాంగ్రెస్ వైపు నిలుస్తారా? లేదా బీజేపీ వైపు నిలుస్తారా? అన్నది కీలకంగా మారనుంది.