Telugu Global
NEWS

జగన్ మద్దతు ఎవరికో తెలిసిపోయింది..!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనేక విశ్లేషణల ద్వారా ఈ కంక్లూజన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేవలం అసెంబ్లీలో మెజార్టీ సాధించడమే కాక.. అత్యధిక పార్లమెంటు సీట్లు కూడా వైసీపీ గెలువబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. ఈ సారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ కూడా రాదని తెలుస్తోంది. అయితే యూపీఏ పరిస్థితి కూడా […]

జగన్ మద్దతు ఎవరికో తెలిసిపోయింది..!
X

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనేక విశ్లేషణల ద్వారా ఈ కంక్లూజన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేవలం అసెంబ్లీలో మెజార్టీ సాధించడమే కాక.. అత్యధిక పార్లమెంటు సీట్లు కూడా వైసీపీ గెలువబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి. ఈ సారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ కూడా రాదని తెలుస్తోంది. అయితే యూపీఏ పరిస్థితి కూడా ఏం బాగోలేదు. అది కూడా మెజార్టీ సాధించే దాఖలాలు కనపడట్లేదు.

ఈ సారి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు తప్పక లభించాలి. టీఆర్ఎస్, వైసీపీ, బీజూ జనతాదళ్ వంటి పార్టీలకు మంచి డిమాండ్ ఉండబోతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎటువైపు మొగ్గు చూపుతారనే చర్చ జరుగుతోంది. అయితే ఈ విషయంలో కూడా క్లారీటీ వచ్చింది.

గత ఐదేళ్లుగా జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు. టీడీపీ – బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు హోదాను తేలేకపోయారు. కాని జగన్ పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వమైతే ప్రత్యేక హోదాకు సై అంటుందో దానికే తన మద్దతు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఎన్డీయే, యూపీఏ కూటముల్లో ఎవరైతే హోదాపై తొలి సంతకం పెడితే వారికే వైఎస్ జగన్ మద్దతు ఉంటుంది. హోదాతో తన మద్దతును ముడిపెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో కూడా చర్చించుకుంటున్నారు.

First Published:  12 May 2019 2:30 AM IST
Next Story