మన్యంలో మావోయిస్టు అగ్రనేతలు..?
మన్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్…. ఆంధ్రా – ఒడిషా బోర్డర్‌లో మకాం వేసినట్లు సమాచారం రావడంతో అటు కొరాపుట్ జిల్లా, ఇటు విశాఖ ఏజెన్సీలో పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత వారం కొరాపుట్ జిల్లా పాడువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిటుబ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టుల కిట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కీలక సమాచారం లభ్యం కావడంతో వాటి […]
మన్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్…. ఆంధ్రా – ఒడిషా బోర్డర్‌లో మకాం వేసినట్లు సమాచారం రావడంతో అటు కొరాపుట్ జిల్లా, ఇటు విశాఖ ఏజెన్సీలో పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత వారం కొరాపుట్ జిల్లా పాడువా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిటుబ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.
ఈ ఎన్‌కౌంటర్ అనంతరం మావోయిస్టుల కిట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో కీలక సమాచారం లభ్యం కావడంతో వాటి ఆధారంగా కూంబింగ్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతో స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
కాగా, 10వ తేదీన మల్కన్‌గిరి, చత్తీస్‌గడ్ సరిహద్దుల్లో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. మరోవైపు సీలేరులో ఇద్దరు హోంగార్డులులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వీరిరువురూ మావోయిస్టులకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. కీలక సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఆ హొంగార్డుల మీద ఉన్నాయి.