Telugu Global
Cinema & Entertainment

మహర్షీ.... మరీ అంత పేలవంగానా!

స్టార్ హీరోల సినిమాలకు మొదటి వారాంతం చూసుకోనక్కర్లేదు. విడుదలైన రోజు నుంచి కౌంట్ చేసుకుంటే శని, ఆదివారాలు వీళ్ల సినిమాలు హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తాయి. కానీ మహర్షి విషయంలో మాత్రం ఈ లెక్క తప్పింది. అది కూడా ఇక్కడ కాదు, ఓవర్సీస్ లో. అవును.. ఓవర్సీస్ లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పేలవంగా సాగుతోంది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్ మార్క్ టచ్ అవుతుందని ఆశించారంతా. ఎందుకంటే, ప్రీమియర్స్ కు సంబంధించి బాహుబలి-2 […]

మహర్షీ.... మరీ అంత పేలవంగానా!
X

స్టార్ హీరోల సినిమాలకు మొదటి వారాంతం చూసుకోనక్కర్లేదు. విడుదలైన రోజు నుంచి కౌంట్ చేసుకుంటే శని, ఆదివారాలు వీళ్ల సినిమాలు హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తాయి. కానీ మహర్షి విషయంలో మాత్రం ఈ లెక్క తప్పింది. అది కూడా ఇక్కడ కాదు, ఓవర్సీస్ లో. అవును.. ఓవర్సీస్ లో ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పేలవంగా సాగుతోంది.

ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్ మార్క్ టచ్ అవుతుందని ఆశించారంతా. ఎందుకంటే, ప్రీమియర్స్ కు సంబంధించి బాహుబలి-2 తర్వాత అత్యథిక థియేటర్లు దక్కింది ఈ సినిమాకే. అలా భారీ స్థాయిలో ప్రీమియర్స్ వేయగా, హాఫ్-మిలియన్ (5 లక్షల డాలర్లు) కు అటుఇటుగా వసూళ్లు రావడం అందర్నీ నిరాశపరిచింది. బాహుబలి-1 మొదటి రోజు వసూళ్ల సంగతి పక్కనపెడితే, ఈ ప్రీమియర్స్ ద్వారా తన సినిమాలైన భరత్ అనే నేను వసూళ్లను కూడా క్లాస్ చేయలేకపోయాడు మహేష్.

అలా నెమ్మదిగా ప్రారంభమైన మహర్షి సినిమా ఎట్టకేలకు మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. నిన్నటి వసూళ్లతో ఈ సినిమాకు 10 లక్షల డాలర్లు వచ్చాయి. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజుకే మిలియన్ డాలర్లు వస్తాయని ఆశించిన ట్రేడ్ కు మహర్షి అలా షాకిచ్చింది. ఇక ఈ సినిమాకు 10 లక్షల డాలర్లు వచ్చిన వైనం ఇలా ఉంది.

ప్రీమియర్స్ – $ 516, 441 (232 లొకేషన్లు)
మొదటి రోజు – $ 176, 657 (225 లొకేషన్లు)
రెండో రోజు – $ 232, 325 (224 లొకేషన్లు)
మూడో రోజు – $ 178, 029 (220 లొకేషన్లు)
టోటల్ గ్రాస్ – $ 1.10 మిలియన్

First Published:  12 May 2019 5:11 AM IST
Next Story