చేపలు....ఆరోగ్యానికి కంటి పాపలు
ఆరోగ్యమే మహాభాగ్యం…. ఆరోగ్యానికి మించి ఇంక ఏది లేదన్నది అక్షర సత్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మన వంతు జాగ్రత్త ఎంతో అవసరం. చేపలు కాస్త ఖరీదైనప్పటికీ వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పోలిస్తే ఖరీదు గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం చేపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం. చేపల్లో ఉన్న ఒమేగా-3 వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. డిప్రెషన్, వత్తిడికి గురి […]
BY sarvi12 May 2019 5:08 AM IST
X
sarvi Updated On: 12 May 2019 5:08 AM IST
ఆరోగ్యమే మహాభాగ్యం…. ఆరోగ్యానికి మించి ఇంక ఏది లేదన్నది అక్షర సత్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మన వంతు జాగ్రత్త ఎంతో అవసరం.
చేపలు కాస్త ఖరీదైనప్పటికీ వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పోలిస్తే ఖరీదు గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనం చేపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.
- చేపల్లో ఉన్న ఒమేగా-3 వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.
- డిప్రెషన్, వత్తిడికి గురి అవుతున్న వారికి చేపలు మంచి ఆహారం. చేపలలో ఉండే అయిల్స్ లో మానసిక రుగ్మతలను అదుపు చేసే గుణాలు అధికంగా ఉన్నాయి.
- చేపలలో విటమిన్ డి, ఒమేగా-3 వంటివి అధికంగా ఉన్నాయి. ఈ కారణంగా నిద్రలేమితో బాధపడుతున్న వారికి చేపలు దివ్యౌషధం.
- చేపల్లో ఉన్న ఒమేగా-3 శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను చేరనివ్వదు. ఒకవేళ అప్పటికే శరీరంలో కొవ్వు పేరుకు పోయి ఉంటే దానిని నెమ్మదిగా కరిగిస్తాయి.
- మనకు దొరికే ఆహార పదార్దలలో చేప ఎంతో ముఖ్యమైనది. అందులో ఉండే విటమిన్ డి, క్యాల్షియం అనేక రోగాలను అరికడుతుంది. విటమిన్ డి లోపంతో బాధపడుతున్న వారు ప్రతిరోజు చేపలు తింటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
- కంటి సమస్యలకు చేపలు చాలా బాగా పని చేస్తాయి. రేచీకటి, కంటికి సంబంధించి ఇతర సమస్యలకు చేపలతో ఫుల్ స్టాప్ పెట్టవచ్చు.
- చేపలలో మెగ్నీషయం, పొటాషియం, జింక్, అయోడిన్, ఐరన్ ఇంకా అనేక ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు తగ్గించడానికి, ఎముకలు, కండరాల బలానికి ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.
- చేపలు ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. తరచూ చేపలు తినే వారి చర్మం ఎంతో కాంతివంతగాను, యవ్వనంగానూ ఉంటుందని, దీనికి కారణం చేపలలో ఉండే అయిల్స్ అని వైద్యులు చెబుతున్నారు.
- చేపల్లో ఉన్న మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తక్కవగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
- కీళ్లవాతం (Rheumatoid arthritis), కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారికి చేపలు ఉపశమనం కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
- రోగనిరోధక శక్తిని పెంచే చేపలు తరచూ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
Next Story