Telugu Global
Cinema & Entertainment

ఈ జంటకు ఇన్నాళ్లకు టైమ్ దొరికింది

పెళ్లి తర్వాత హనీమూన్ కు కూడా వెళ్లలేదు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయిపోయారు. మధ్యమధ్యలో చిన్న బ్రేక్స్ తప్పిస్తే, ఫుల్ లెంగ్త్ హాలిడే ట్రిప్ ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు నాగచైతన్య, సమంత. ఇన్నాళ్లకు వాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంచక్కా స్పెయిన్ చెక్కేశారు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్పెయిన్ పర్యటనకు సంబంధించి వరుసగా ఫొటోలు షేర్ చేస్తోంది సమంత. పనిలోపనిగా తన అభిరుచుల్ని పంచుకుంటోంది. వైన్ తాగుతూ, పిజ్జా […]

ఈ జంటకు ఇన్నాళ్లకు టైమ్ దొరికింది
X

పెళ్లి తర్వాత హనీమూన్ కు కూడా వెళ్లలేదు. పూర్తిగా సినిమాలకే పరిమితం అయిపోయారు. మధ్యమధ్యలో చిన్న బ్రేక్స్ తప్పిస్తే, ఫుల్ లెంగ్త్ హాలిడే ట్రిప్ ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు నాగచైతన్య, సమంత. ఇన్నాళ్లకు వాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఎంచక్కా స్పెయిన్ చెక్కేశారు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం స్పెయిన్ పర్యటనకు సంబంధించి వరుసగా ఫొటోలు షేర్ చేస్తోంది సమంత. పనిలోపనిగా తన అభిరుచుల్ని పంచుకుంటోంది. వైన్ తాగుతూ, పిజ్జా తినడం అంటే సమంతకు చాలా ఇష్టమట. మంచి పిజ్జా తినాలంటే స్పెయిన్ వెళ్లాల్సిందేనంటోంది ఈ బ్యూటీ. అంతేకాదు.. దానికి సంబంధించిన స్టిల్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మజిలీ సినిమా తర్వాత నాగచైతన్య వెంటనే వెంకీ మామ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. సమంత మాత్రం కాస్త గ్యాప్ తీసుకుంది. హే బేబీ సినిమా చేతిలో ఉన్నప్పటికీ షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చింది. ఈలోగా చైతూ కూడా వెంకీమామ షెడ్యూల్ పూర్తిచేయడంతో.. ఇద్దరూ కలిసి స్పెయిన్ వెళ్లిపోయారు. గోవా తర్వాత వీళ్లకు ఇష్టమైన ప్రాంతం స్పెయిన్. బార్సిలోనా బీచ్ అంటే వీళ్లకు చాలా ఇష్టం. అలా స్పెయిన్ దేశం మొత్తం చుట్టేస్తోంది ఈ జంట.

First Published:  11 May 2019 4:52 AM IST
Next Story