Telugu Global
Cinema & Entertainment

మీడియాకు చురకలంటించిన వంశీ పైడిపల్లి

మహర్షి సినిమా థియేటర్లలోకొచ్చింది. నిన్నటితో 2 రోజుల రన్ వూర్తిచేసుంది. భారీ సంఖ్యలో థియేటర్లు, టిక్కెట్ రేట్ల పెంపు కారణంగా మొదటి రోజు వసూళ్లలో చాలా చోట్ల నాన్-బాహుబలి రికార్డులు సృష్టించింది ఈ సినిమా. అయితే సినిమాకు వసూళ్లు ఏ స్థాయిలో వస్తున్నాయో, నెగెటివ్ టాక్ కూడా అదే స్థాయిలో నడుస్తోంది. మరీ ముఖ్యంగా 2-3 సినిమాలు కలిపి చూసిన ఫీలింగ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్. ప్రెస్ మీట్లు చూస్తే భరత్ అనే నేను, […]

మీడియాకు చురకలంటించిన వంశీ పైడిపల్లి
X

మహర్షి సినిమా థియేటర్లలోకొచ్చింది. నిన్నటితో 2 రోజుల రన్ వూర్తిచేసుంది. భారీ సంఖ్యలో థియేటర్లు, టిక్కెట్ రేట్ల పెంపు కారణంగా మొదటి రోజు వసూళ్లలో చాలా చోట్ల నాన్-బాహుబలి రికార్డులు సృష్టించింది ఈ సినిమా. అయితే సినిమాకు వసూళ్లు ఏ స్థాయిలో వస్తున్నాయో, నెగెటివ్ టాక్ కూడా అదే స్థాయిలో నడుస్తోంది. మరీ ముఖ్యంగా 2-3 సినిమాలు కలిపి చూసిన ఫీలింగ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్.

ప్రెస్ మీట్లు చూస్తే భరత్ అనే నేను, సీఈవో గెటప్ చూస్తే శ్రీమంతుడు, ఫ్యామిలీ ఎమోషన్స్ దగ్గరకొచ్చేసరికి సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమాలు గుర్తొచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫస్టాఫ్ కు, సెకెండాఫ్ కు అస్సలు సంబంధం లేకుండా చేశారని.. ఒకే టిక్కెట్టుపై 2 సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కొన్ని రివ్యూలు కూడా ఇలానే రాశాయి.

వీటన్నింటిపై దర్శకుడు వంశీ పైడిపల్లి స్పందించాడు. నెటిజన్లు, సమీక్షకులు ఏమనుకుంటున్నారనేది తనకు అనవసరమని… సగటు ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడనేదే తనకు ముఖ్యమంటూ సుతారంగా చురకలు అంటించాడు. 2 సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుందనే కామెంట్ ను అంగీకరించిన వంశీ పైడిపల్లి, పెద్ద కథను చెబుతున్నప్పుడు అలా అనిపించడం సహజమన్నాడు.

First Published:  11 May 2019 2:47 AM IST
Next Story