జడ్జిపైనే నోరు పారేసుకున్నాడు.... 130 కోట్లు పరిహారం కట్టాడు !
ఒక వ్యక్తి నోటి దురుసుతో 130 కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి వచ్చింది. ఎక్కడ మాట్లాడాలో కాదు ఎక్కడ మౌనంగా ఉండాలో కూడా నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కొన్ని సార్లు మన మౌనమే మనలను రక్షిస్తుంది. లేక పోతే ఇదిగో ఈ పెద్దమనిషిలా పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు. ఇండియాకు చెందిన గోపీనాథన్ (69) ఒక డాక్టర్. 1997లోనే ఇండోనేషియా వెళ్లి అక్కడ ఒక ఆసుపత్రిలో పని చేశాడు. ఆ సమయంలోనే అక్కడ ఒక నర్స్‌తో సంబంధం పెట్టుకొని […]
ఒక వ్యక్తి నోటి దురుసుతో 130 కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి వచ్చింది. ఎక్కడ మాట్లాడాలో కాదు ఎక్కడ మౌనంగా ఉండాలో కూడా నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కొన్ని సార్లు మన మౌనమే మనలను రక్షిస్తుంది. లేక పోతే ఇదిగో ఈ పెద్దమనిషిలా పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు.
ఇండియాకు చెందిన గోపీనాథన్ (69) ఒక డాక్టర్. 1997లోనే ఇండోనేషియా వెళ్లి అక్కడ ఒక ఆసుపత్రిలో పని చేశాడు. ఆ సమయంలోనే అక్కడ ఒక నర్స్‌తో సంబంధం పెట్టుకొని భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత నర్స్‌ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్నాడు. కొన్నాళ్లకు అతను కొలంబియాకు షిఫ్ట్ అయ్యాడు. అయితే వెళ్లే సమయంలో భార్యా, పిల్లలను ఇండోనేషియాలోనే వదలి వెళ్లాడు.
అయితే ఎన్ని సార్లు రెండో భార్య తనను, పిల్లలను కొలంబియా తీసుకెళ్లమని కోరినా సమాధానం దాటేసేవాడు. దీంతో ఆమె కొలంబియాలో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. ఈ విడాకుల కేసు నడుస్తున్న సమయంలో గోపినాథ్ తన ఆస్తుల అమ్మకం, పంపకం పనులు చేపట్టాడు. దీంతో జడ్జ్ ఈ ప్రక్రియను నిలిపివేయాలని గోపీనాథన్‌ను హెచ్చరించారు.
దాంతో ఆ మహిళా న్యాయమూర్తిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టాడు. పైగా తన భార్య నుంచి లంచం తీసుకొని తీర్పులు చెబుతున్నావంటూ ఆరోపించాడు.
ఆ జడ్జీ ఈ మాటలను సీరియస్‌గా తీసుకొని ఏకంగా 130 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అంతే కాక నెలకు 50 లక్షల చొప్పున ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి.. మౌనంగా ఉంటే అయిపోయే దానికి నోటి దురుసుతో 130 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు.