ఐపీఎల్ మహిళా చాలెంజ్ ఫైనల్స్ లో సూపర్ నోవాస్
రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి మ్యాచ్ లో వెలాసిటీ పై గెలుపు మూడుజట్ల లీగ్ నుంచి ఫైనల్లో సూపర్ నోవాస్, వెలాసిటీ ఐపీఎల్ మహిళా చాలెంజ్ ఫైనల్స్ కు జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మిథాలీ రాజ్ నాయకత్వంలోని సూపర్ నోవాస్, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని వెలాసిటీ , స్మృతి మంథానా నాయకత్వంలోని ట్రెయిల్ బ్లేజర్స్ జట్లు ఈ మూడు స్తంభాలాటలో తలపడ్డాయి. మూడుజట్ల ఈ రౌండ్ రాబిన్ లీగ్ నుంచి వెలాసిటీ, […]
- రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి మ్యాచ్ లో వెలాసిటీ పై గెలుపు
- మూడుజట్ల లీగ్ నుంచి ఫైనల్లో సూపర్ నోవాస్, వెలాసిటీ
ఐపీఎల్ మహిళా చాలెంజ్ ఫైనల్స్ కు జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. మిథాలీ రాజ్ నాయకత్వంలోని సూపర్ నోవాస్, హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని వెలాసిటీ , స్మృతి మంథానా నాయకత్వంలోని ట్రెయిల్ బ్లేజర్స్ జట్లు ఈ మూడు స్తంభాలాటలో తలపడ్డాయి.
మూడుజట్ల ఈ రౌండ్ రాబిన్ లీగ్ నుంచి వెలాసిటీ, సూపర్ నోవాస్ జట్లు టైటిల్ సమరానికి సిద్ధమయ్యాయి. ఆఖరి లీగ్ పోటీలో సూపర్ నోవాస్ 12 పరుగుల తేడాతో వెలాసిటీని చిత్తు చేసింది.
మొత్తం మూడు జట్లు తలో రెండుపాయింట్లు సాధించడంతో… నెట్ రన్ రేట్ న సూపర్ నోవాస్, వెలాసిటీ జట్లు ఫైనల్స్ చేరుకోగలిగాయి. ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
జెమీమా షో….
జైపూర్ వేదికగా జరిగిన ఈ అఖరి రౌండ్ పోటీలో..మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీజట్టు ముందుగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకొంది. ఓపెనర్లు పూనియా 16, జయాంగన 31 పరుగుల స్కోర్లతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు.
వన్ డౌన్ జెమీమా రోడ్రిగేస్ 48 బాల్స్ లో 10 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 77 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. దీంతో సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 142 పరుగుల స్కోరు సాధించింది.
సమాధానంగా…143 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన వెలాసిటీ…20 ఓవర్లలో 3 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.
వన్ డౌన్ వెయిట్ 43, కెప్టెన్ మిథాలీ రాజ్ 40 పరుగులు సాధించినా ప్రయోజనం లేకపోయింది. వెలాసిటీ విజయంలో ప్రధాన పాత్ర వహించిన యువప్లేయర్ జెమీమాకు ప్లేయరా ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టైటిల్ సమరంలో తిరిగి ఈ రెండుజట్లే తలపడతాయి.