Telugu Global
CRIME

ఐపీఎల్ బెట్టింగ్‌లు వద్దన్నందుకు.... భార్యను చంపిన భర్త

బెట్టింగ్, జూదం కూడా డ్రగ్స్, మద్యం లాగే మనిషిలోని విచక్షణను చంపేస్తున్నాయి. ఆ తర్వాత ఏం చేస్తామో కూడా గుర్తుండదు. ఆవేశంలో బంధాలను కూడా తెంచేసుకునేలా చేస్తుంది. అలాంటి బెట్టింగ్ మత్తులో పడిన భర్తను వారించినందుకు ప్రాణాలు కోల్పోయిందో భార్య. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణానికి చెందిన సువేందు దాస్ గుప్తాకు ఆరేళ్ల క్రితం అర్పితతో వివాహమైంది. సువేందు దాస్ ఇటీవల ఐపీఎల్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు […]

ఐపీఎల్ బెట్టింగ్‌లు వద్దన్నందుకు.... భార్యను చంపిన భర్త
X

బెట్టింగ్, జూదం కూడా డ్రగ్స్, మద్యం లాగే మనిషిలోని విచక్షణను చంపేస్తున్నాయి. ఆ తర్వాత ఏం చేస్తామో కూడా గుర్తుండదు. ఆవేశంలో బంధాలను కూడా తెంచేసుకునేలా చేస్తుంది. అలాంటి బెట్టింగ్ మత్తులో పడిన భర్తను వారించినందుకు ప్రాణాలు కోల్పోయిందో భార్య.

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా పట్టణానికి చెందిన సువేందు దాస్ గుప్తాకు ఆరేళ్ల క్రితం అర్పితతో వివాహమైంది. సువేందు దాస్ ఇటీవల ఐపీఎల్ బెట్టింగులకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు కోల్పోయాడు. పందేల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వాటిని తిరిగి తీర్చలేదు.

ఈ క్రమంలో అప్పుల వాళ్లు సువేందు దాస్‌ను వారి వెంట తీసుకెళ్లి బంధించారు. ఒక రోజంతా వారితోనే ఉంచుకొని సాయంత్రం వదిలేశారు. ఇంటికి వచ్చిన భర్తను అర్పిత నిలదీసింది. అప్పులు చేయొద్దని భర్తను అర్పిత వారించింది. బెట్టింగులు మానేయమని ఆమె వేడుకుంది.

అప్పటికే తీవ్రమైన కోపంతో ఉన్న సువేందు దాస్, కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టి ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను మాల్దా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు.

కూతురు మరణవార్త తెలుసుకొని అర్పిత తండ్రి సంతోష్ దత్త పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారు. నా కూతురు మరణానికి బెట్టింగులే కారణమని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

First Published:  9 May 2019 9:24 PM GMT
Next Story